Kalki2898AD : డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ..అభిమానులు ఎదురుచూస్తున్న అసలైన సాలిడ్ అప్డేట్ వచ్చేసింది..

Kalki2898AD : టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు ఇండియా వైడ్ గా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమా కల్కి2898AD. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుస్తుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా జూన్ 27న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా, నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మైథలాజికల్ టచ్ తో తెరకెక్కిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ఇంటెర్నేషల్ లెవల్ లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక చిత్ర యూనిట్ ఆల్రెడీ రెండు వారాల కిందే ప్రమోషన్లు భీభత్సంగా మొదలుపెట్టేయగా, ఆ ప్రమోషన్లు పీక్స్ కి తీసుకెళుతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా (Kalki2898AD) కావడంతో కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా కల్కి2898AD నుండి ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలైన అప్డేట్ వాచేసింది.

Kalki2898AD Movie Online Bookings Update

ఆ రోజున బుకింగ్స్ ఓపెన్..

ఇక కల్కి సినిమా నుండి ప్రమోషన్లతో ఇప్పటికే హైప్ ఓ రేంజ్ లో పెంచేయగా, ఈ సినిమా నుండి ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా చూడాలనే కోరిక సినీ అభిమానులతో పాటే, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లో ఓ రేంజ్ లో ఆతృతగా ఉంది. అయితే అలా ఈ సినిమా చూసేందుకు చూస్తున్న వారికి ఓ గుడ్‌ న్యూస్ ఇచ్చింది డైరెక్టర్ నాగ్ అశ్విన్ టీం. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటి నుంచో చెప్పేసింది. అవును.. ప్రభాస్ కల్కి మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు టీమ్ తాజాగా సమాచారం ఇచ్చింది. జూన్ 7 నుంచి ‘కల్కి 2898 AD’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుందంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులను ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది. ఈ మూవీ ఫస్ట్ ఫోటో టికెట్ల కోసం పోటీ పడేందుకు రెడీ అయ్యేలా కూడా చేస్తోంది.

- Advertisement -

ఇంటర్నేషనల్ రేంజ్ లో కల్కి..

ఇక కల్కి సినిమా ని దాదాపు 22 భాషల్లో రిలీజ్ చేస్తుండగా, ఇంటెర్నేషల్ టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాను రానా ఇంటెర్నేషనల్ రేంజ్ లోనే తన అనుభవంతో దగ్గరుండి ప్రమోట్ చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె, దిషాపటాని హీరోయిన్లుగా నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి పాటలు ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మరి ఫైనల్ గా కల్కి2898AD సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు