Kalki2898AD : ఫ్యాన్స్ కి షాకిచ్చిన మేకర్స్.. అనుకున్నదే జరిగింది?

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే ఇండియన్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి2898AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూడేళ్ల పాటు తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తోనే పిచ్చెక్కించే హైప్ ని సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇతర భాషల్లో కల్కి ని ప్రమోట్ చేయట్లేదని ఫ్యాన్స్ నిరాశ పడగా, తాజాగా హిందీలోనే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వయంగా దగ్గుపాటి రానా దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు లెజెండరీ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు రాగా, దీపికా పదుకునె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ సినిమా కోసం ప్రమోషన్స్ కి రావడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రస్తావించడం జరిగింది. ఇక కల్కి కోసం తెలుగుతో పాటు ముఖ్యంగా హిందీలో కల్కి కోసం మూవీ లవర్స్ ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాకి ఉన్న హైప్ కి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ పక్కాగా చెప్తున్నారు. ఇదిలా ఉండగా కల్కి సినిమా రిలీజ్ కి వారం రోజులే ఉండడంతో అన్ని చోట్ల ప్రమోషన్లు ఏకకాలంలో చేయాల్సిన పరిస్థితి ఈ క్రమంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి షాకిచ్చింది చిత్ర యూనిట్.

Kalki2898AD Movie Telugu Pre Release Event Cancelled?

తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ లేనట్టేనా?

అయితే కల్కి2898AD సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇది ప్రభాస్ సినిమా కాబట్టి మామూలుగానే తెలుగు స్టేట్స్ లో అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటారు. టాక్ తో సంబంధం లేకుండా భారీగా థియేటర్లకు జనాలు వస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఖచ్చితంగా నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈ మధ్య అప్పుడప్పుడూ అది బ్రేక్ అవుతూ వస్తుంది. అయితే ప్రభాస్ నటిస్తున్న కల్కి టీమ్ నుండి అభిమానులకు ఊహించని వార్త వచ్చింది. కల్కి2898AD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించడం లేదట. ఇతర భాషల్లో సినిమాని ప్రమోట్ చేయడానికి సమయం లేనందునా, తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయడం లేదని సమాచారం.

- Advertisement -

ఫ్యాన్స్ లో జోష్ కోసం రిలీజ్ ట్రైలర్ రెడీ..!

ఇక కల్కి2898AD (Kalki2898AD) మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఈవెంట్స్ చేయకపోతున్నందుకు నిరాశతో ఉన్న ప్రభాస్ అభిమానులకు జోష్ నింపడానికి చిత్ర యూనిట్ రిలీజ్ ట్రైలర్ ను రెడీ చేస్తుంది. ఆల్రెడీ కొన్ని రోజుల కింద రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలని పదింతలు చేసింది. ప్రమోషన్లు లేకపోయినా, ఒక్క ట్రైలర్ తో పాన్ ఇండియా వైడ్ గా కల్కి పై ఫోకస్ చేసేలా చేసారు. ఇక ఇప్పుడు అభిమానులకు మరింత జోష్ ని ఇస్తూ, నిమిషంన్నర నిడివి ఉన్న రిలీజ్ ట్రైలర్ ని పవర్ ప్యాకడ్ థ్రిల్స్ తో కూడిన ఆక్షన్ ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేయనున్నారు. ఇక కల్కి మూవీకి సంబంధించి బహుశా తెలుగులో స్పెషల్ ఇంటర్వ్యూలు చేసే ఛాన్స్ ఉంది. ఇక కల్కి2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుండగా, చిత్ర యూనిట్ సహా, అభిమానుల సందడి ఇప్పటినుండే మొదలయిందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు