Kalki2898AD : మూవీ లవర్స్ కి క్రేజీ అప్డేట్.. తగ్గుతున్న కల్కి టికెట్ రేటు.. ఎప్పట్నుంచంటే?

Kalki2898AD : టాలీవుడ్ లో ఇప్పుడంతా కల్కి మ్యానియానే నడుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి వరల్డ్ వైడ్ గా యనానిమస్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లతో దుమ్ములేపుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు సంతృప్తి పడిన సినిమా ఇదేనంటూ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నమాట. ప్రభాస్ సహా, అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ అభిమానులకు ఈ సినిమా విజువల్ ట్రీట్ గా మారింది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా మొదటివారం పూరయ్యే సరికి 700 కోట్లకి చేరువలో వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అయితే కల్కి కి ఇంత భారీ కలెక్షన్లు రావడానికి కారణం పెంచిన టికెట్ రేట్లు కూడా అని చెప్పొచ్చు. ఇవి సామాన్యుడికి అందనంత రేంజ్ లో ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ లలో కూడా కల్కి కి 250 రూపాయలకి పైగా కల్కి రేట్లు ఉన్నాయి. ఇక మల్టీ ప్లెక్స్ లో అయితే ఏకంగా 500 కి పైగా రేట్లు ఉన్నాయి. అందువల్ల ఫ్యామిలీతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలంటే ధైర్యం చేయలేని పరిస్థితి. అయితే తాజాగా కల్కి టికెట్ రేట్లపై మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది.

Kalki2898AD movie ticket prices to drop in theaters soon

తగ్గనున్న కల్కి రేట్లు..

తాజాగా అందిన సమాచారం ప్రకారం కల్కి మూవీ టికెట్ రేట్లు తగ్గుతున్నాయని అప్డేట్ వచ్చింది. కల్కి (Kalki2898AD) సినిమా టికెట్ రేట్లు ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ లలో 250 ఉండగా మల్టిప్లెక్స్ లో 400 కి పైగా ఉంది. తాజా సమాచారం ప్రకారం కల్కి టికెట్ రేట్లు నార్మల్ కానున్నాయట. ప్రస్తుతం ఈరోజు కల్కి కి వచ్చే ప్రేక్షకుల సంఖ్యను బట్టి ముందుగా కల్కి టికెట్ రేటు మల్టిప్లెక్స్ లో 235/- అలాగే సింగిల్ స్క్రీన్స్ లో 150/- చేయనున్నారట. అయితే తొలివారం పూర్తయిన తరవాతే ఈ రెట్లని తగ్గించే అవకాశం ఉంది. ఇక కల్కి ఇప్పటికే 500 కోట్లకి పైగా భారీ కలెక్షన్లు రాగా, అవి టికెట్ రేట్లు పెంచడం ద్వారనే అని చెప్పొచ్చు.

- Advertisement -

వర్కింగ్ డేలో కూడా ఇక రచ్చ ఖాయం..

అయితే వీకెండ్ తరవాత సినిమాకి కలెక్షన్లు రావాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ద్వారానే సాధ్యం. కానీ ఈ రేంజ్ టికెట్ రేట్లతో జనాలు థియేటర్లకు రారు, కాబట్టే, మేకర్స్ ముందుగానే గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు రేట్లు తగ్గిస్తుండడంతో వర్కింగ్ డేస్ లో కూడా కల్కికి మంచి వసూళ్లు వస్తాయని అంటున్నారు నెటిజన్లు. ఇక ఫ్యాన్స్ కూడా రెండు మూడు సార్లు థియేటర్లలో దుమ్ములేపే ఛాన్స్ ఉంది. ఇక కల్కి సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా, వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా రూపొందిన విషయం తెలిసిందే. 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా రెండు వారాలు ముగిసే లోగా ఈ ఫీట్ ని సాధించే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు