Kalki2898AD : షాక్ ఇస్తున్న కల్కి టిక్కెట్ ధర, సినిమా షాక్ ఇవ్వకపోతే అదే హ్యాపీ

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి2898AD సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో రచ్చ చేయబోతుంది. విడుదలకు ఇంకా సరిగ్గా ఐదు రోజులే ఉన్న నేపథ్యంలో కల్కి చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. తక్కువ టైం ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ నిర్వహించడం లేదు. కానీ ఇతర భాషల్లో ఈవెంట్స్, ప్రమోషన్లు చేయబోతున్నారు. ఇక ప్రభాస్ సహా కల్కి చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా కల్కి2898AD మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సహా, సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, సినిమాపై అంచనాలు పెంచేయగా, రీసెంట్ గా కల్కి నుండి రిలీజ్ ట్రైలర్ అంటూ మరో రెండో ట్రైల‌ర్ వ‌చ్చింది. ఇక లేటెస్ట్‌గా వచ్చిన అయిన రిలీజ్ ట్రైల‌ర్ దాన్ని మించిపోయిందనే మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. విజువ‌ల్స్‌తో పాటు క‌థ‌లోని ఎమోష‌న్లు ఎలివేట్ అయ్యేలా ట్రైల‌ర్ క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇక ఈ ట్రైలర్ లో కథకి సంబంధించి కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఇదిలా ఉండగా కల్కి (Kalki2898AD) సినిమా బెనిఫిట్ షో ల రేట్లు, అలాగే రెగ్యులర్ షో ల డీటెయిల్స్ వచ్చాయి. అయితే ఆ రేట్లు చూసిన జనాలకి షాకిచ్చేలా ఉన్నాయి.

Kalki2898AD Movie Ticket Rates Heavily Raised

షాకిస్తున్న కల్కి టికెట్ రేట్లు?

ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి కల్కి2898AD టికెట్ల కి రేటుని పెంచుతూ పర్మిషన్ తీసుకోగా, కల్కి సినిమాకి సంబంధించి థియేటర్ ని బట్టి రేట్లు నిర్ణయించబడ్డాయి. ఇక ఆ రేట్లు చూస్తుంటే మాత్రం సామాన్యుడికి అందనంత రేంజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అభిమానులకతే కళ్ళు బైర్లు గమ్మేలా షాకిస్తున్నాయి రేట్లు. కల్కి మూవీ రెగ్యులర్ షో ల రేట్ల విషయానికి వస్తే… సింగిల్ స్క్రీన్ థియేటర్లో రెగ్యులర్ షోల రేట్లు ఒక టికెట్ కి – 265/- రూపాయలుగా నిర్ణయించగా, మల్టీప్లెక్స్ లో 413/ రూపాయలు పెట్టడం జరిగింది. ఇక బెనిఫిట్ షోల రేటు అంతకన్నా దారుణంగా ఉన్నాయి. నైజాంలో కల్కి2898AD సినిమాకి బెనిఫిట్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో – 377/- రూపాయలు గా నిర్ణయించగా, మల్టీప్లెక్స్ – 495/- రూపాయలుగా డిసైడ్ చేసారు. ఒక టికెట్ రేటు ఏకంగా ఐదు వందలు పెట్టారంటే.. ఇది ఒక సగటు సామాన్యుడి రోజువారీ సంపాదన. ఈ రేంజ్ లో రేటు పెడితే, ఫ్యామిలీ తో ఎలా చూడాలని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఎంతైనా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఆ తర్వాత కూడా ఇదే రేటు ఉంటె చెప్పలేం. ఏది ఏమైనా సినిమా సినిమా షాక్ ఇవ్వకపోతే అదే హ్యాపీ, అని ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -

భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన మేకర్స్!

ఇక కల్కి2898AD సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచి పర్మిషన్ తెచ్చుకున్న మేకర్స్, తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ పై కన్నేశారని తెలుస్తుంది. ఆల్మోస్ట్ 80 శాతానికి పైగా స్క్రీన్స్ లో కల్కి ని రిలీజ్ చేస్తున్నారట. ఇకపోతే ఓవర్సీస్ లో కూడా ఇప్పటికే ప్రీమియర్స్ కే 3 మిలియన్ డాలర్లు రాగా, ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇక కల్కి సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా RRR రికార్డ్ బ్రేక్ చేసి అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఫస్ట్ డే ప్రీమియర్స్ తో కలిపి 200 నుండి 250 కోట్లకి పైగా కలెక్షన్లు రావచ్చని రానున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్ వంటి భారీ తారాగణం నటించారు. ఇక జూన్ 27న రిలీజ్ కాబోయే కల్కి ఏ రేంజ్ లో థియేటర్లలో రచ్చ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు