Kalki2898AD: నాగీ బ్లాక్ బాస్టర్ కొట్టినట్లే.. ఆ సీన్స్ హైలెట్ అట..!

Kalki 2898AD.. కేవలం గ్లింప్స్ , టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. అంతకుమించి క్యారెక్టరైజేషన్.. ఊహించని రేంజ్ లో కథ.. ఇక నటీనటులకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన చిత్రం కల్కి 2898 AD. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఏకంగా రూ.600 కోట్లకు పైగా బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.. మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే సినీ ప్రేక్షకులు ప్రభాస్ అభిమానులు థియేటర్లలో బారులు కడుతున్నారు.. 38 సంవత్సరాల వయసులోనే ఏకంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసేసుకున్నారు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. డైరెక్షన్ విభాగంలో అనుభవం లేని కారణంగా సినిమాలో చిన్న చిన్న మైనస్లు ఉన్నప్పటికీ. ప్రభాస్ అభిమానులు మాత్రం సాహోరే నాగ్ అశ్విన్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

బ్లాక్ బస్టర్ కొట్టేసిన నాగ్ అశ్విన్..

Kalki2898AD: Nagi hit blockbuster.. That scene is the highlight..!
Kalki2898AD: Nagi hit blockbuster.. That scene is the highlight..!

తన ఊహలను కల్కి 2898AD రూపంలో తెరపైకి తీసుకొచ్చి వావ్ అనిపించారు.. ఈయన కృషి ,ప్రతిభకు ఎవరైనా సరే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఎంత ఖర్చైనా సరే ప్రతి ఫేమ్ లో కూడా ఆ కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. దాదాపు నాలుగున్నర సంవత్సరాల కష్టానికి కల్కి సినిమా రూపంలో కోరుకున్న ఫలితం లభించింది. హాలీవుడ్ కి పోటీని ఇచ్చే స్థాయిలోనే కాదు.. హాలీవుడ్ నే మించిపోయేలా సినిమా తీయగల భారతీయ దర్శకులు ఉన్నారు అని ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ నిరూపించారు. తాను అనుకున్న కలలకు ప్రభాస్, అమితాబ్ , దీపిక జీవం పోశారు. ముఖ్యంగా ఈ సినిమాలోని బుజ్జి అనే కారు ప్రత్యేకత గురించి.. ఆ కారుకి కీర్తి సురేష్ అందించిన వాయిస్ ఓవర్ గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. నాగ్ అశ్విన్ రూపంలో తెలుగు సినిమా పరిశ్రమకు మరో అద్భుతమైన దర్శకుడు దొరికేశాడు.

హైలెట్ సీన్స్ ఇవే…

ఇకపోతే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ ప్రత్యేకంగా మారుతున్నాయి. బుజ్జి – భైరవ మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు బైరవ – అశ్వద్ధామ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలిచాయని చెప్పవచ్చు.. క్లైమాక్స్లో కమల్ హాసన్ పాత్ర సినిమా కథనే మలుపు తిప్పుతుంది. పైగా శంబల, కాంప్లెక్స్ అన్నీ కూడా సరికొత్తగా అనిపిస్తాయి. అలాగే భైరవ పాత్రకు తండ్రి లాంటి క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. పైగా సినిమా మొదట్లోనే 15 నిమిషాల నిడివిలో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ అద్భుతం అని చెప్పాలి. ఇక ఇలా దీపికా పదుకొనే , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్లంతా కూడా సినిమాకు ప్రాణం పోశారు. పైగా రాజమౌళి, రాంగోపాల్ వర్మ లాంటి దిగ్గజ డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో భాగం కావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. మొత్తానికి అయితే నాగ్ అశ్విన్ టేకింగ్ సినిమాకు మరింత ప్లస్ గా మారింది. ఏది ఏమైనా ఇలాంటి ఎన్నో అంశాలు సినిమాకు హైలెట్గా నిలుస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు