Kalki2898AD : పవర్ ప్యాకడ్ యాక్షన్ ట్రైలర్ వస్తుంది… ఇందులో ఏం ఉంటుందంటే..?

Kalki2898AD : టాలీవుడ్ తో సహా పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూడేళ్ల పాటు తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో పిచ్చెక్కించే హైప్ ని సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇతర భాషల్లో కల్కి ని ప్రమోట్ చేయట్లేదని ఫ్యాన్స్ నిరాశ పడగా, తాజాగా హిందీలోనే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్వయంగా దగ్గుపాటి రానా దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఈ ప్రీ రీలాస్ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు లెజెండరీ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లు రాగా, దీపికా పదుకునె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ సినిమా కోసం ప్రమోషన్స్ కి రావడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని ప్రస్తావించడం జరిగింది. ఇక కల్కి కోసం తెలుగుతో పాటు ముఖ్యంగా హిందీలో కల్కి కోసం మూవీ లవర్స్ ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాకి ఉన్న హైప్ కి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ పక్కాగా చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ తో ఇప్పటికే పిచ్చెక్కించే హైప్ క్రియేట్ అవగా, రేపు మరో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ మెంట్ వచ్చింది.

Kalki2898AD Release Trailer Update

పవర్ ప్యాక్డ్ ట్రైలర్ రెడీ..!

ఇక కల్కి2898AD (Kalki2898AD) నుండి ఆల్రెడీ కొన్ని రోజుల కింద రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలని పదింతలు చేసింది. ప్రమోషన్లు లేకపోయినా, ఒక్క ట్రైలర్ తో పాన్ ఇండియా వైడ్ గా కల్కి పై ఫోకస్ చేసేలా చేసారు. ఇక ఇప్పుడు కల్కి నుండి మరో పవర్ ప్యాకడ్ ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. తాజాగా కాసేపటికిందే ఈ ట్రైలర్ అప్డేట్ రాగా, ట్రైలర్ కి సంబంధించి పవర్ ఫుల్ గా ఓ యాక్షన్ ట్రైలర్ ఉండబోతుందని సమాచారం. నిమిషంన్నర నిడివితో ఉండే ఆ ట్రైలర్ మూవీ లవర్స్ కి ఐ ఫీస్ట్ ఇవ్వబోతుందట. ఇక ఈ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి థ్రిల్లింగ్ షాట్స్ ని స్పెషల్ గా చూపించబోతున్నారని సమాచారం.

- Advertisement -

ట్రైలర్ లో ఏముంటుందంటే..

ఇక రేపు రిలీజ్ కాబోయే రిలీజ్ ట్రైలర్ లో మొత్తం యాక్షన్ సీక్వెన్స్సెస్ కి సంబంధించిన సీన్లు ట్రైలర్ లో స్టైలిష్ గా ఉంటాయని సమాచారం. పైగా కల్కి2898AD ట్రైలర్ లో కొంతమంది నటుల్ని మిస్ చేయగా, ఈ ట్రైలర్ లో వాళ్ళని కూడా స్పెషల్ గా చూపించనున్నట్టు సమాచారం. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ లో అన్నిటికి మించి ఫ్రెష్ విజువల్స్ పైనే ఫోకస్ చేసినట్టు సమాచారం. ఇక ట్రైలర్ లో శోభన, పశుపతి వంటి ఆక్టర్ లని మొదటి ట్రైలర్ లో పెద్దగా చూపించలేదు. వాళ్ళని ఈ ట్రైలర్ లో కవర్ చేయచ్చు. ఓవరాల్ గా ఈ రీలీజ్ ట్రైలర్ కూడా సినిమాపై ఓ రేంజ్ అంచనాలని పెంచేస్తుందని చెప్పొచ్చు, ఇక కల్కి2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుండగా, చిత్ర యూనిట్ సహా, అభిమానుల సందడి ఇప్పటినుండే మొదలయిందని చెప్పొచ్చు. మరి రిలీజ్ రోజు కల్కి ఎలాంటి నమోదు చేస్తుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు