Kalki2898AD : దశావతారాల సమ్మేళనంగా రోమాలు నిక్కబొడుచుకునేలా థీమ్ సాంగ్..

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకొని సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసాయి. ఇక కల్కి నుండి భైరవ అంతెం సాంగ్ పేరుతో పంజాబీ ఫ్లేవర్ తో ఓ సాంగ్ ని కూడా రిలీజ్ చేయగా పాన్ ఇండియా వైడ్ గా ఆ సాంగ్ ఆకట్టుకుంది. ఇక తాజాగా కల్కి నుండి థీమ్ సాంగ్ పేరుతో ఓ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి ‘థీమ్ ఆఫ్ కల్కి’ సాంగ్ పేరిట కాసేపటికిందే మేకర్స్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇక కల్కి థీమ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను లెజెండరీ రచయిత చంద్రబోస్ రాయగా, కాల భైరవ, అనంతు, గౌతమ్ భరద్వాజ్ కోరస్ పాడారు.

Kalki2898AD Theme song released now

దశావతారాల సమ్మేళనంగా కల్కి థీమ్ సాంగ్…

కల్కి (Kalki2898AD) సాంగ్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో యానానిమస్ గా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. అధర్మాన్ని అణచేయగా.. అంటూ మొదలవుతూ సాంగ్ లో దశావతారాలను చూపిస్తూ, పాట ద్వారా విష్ణు మూర్తి దశావతారాల గురించి పాటలో చెప్పడం జరిగింది. ప్రేక్షకులు మాటల్లో చెప్పలేరు గాని పాట వింటుంటే, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అప్పుడెప్పుడో సీతారామశాస్త్రి కృష్ణం వందే జగద్గురుం లో రాసిన పాట మాదిరి కల్కి థీమ్ సాంగ్ తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంది. ముఖ్యంగా పాటలో కల్కి భగవానుడికోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని పాట ద్వారా చెప్పడం జరిగింది. ఇక పాటలో “మీనమై.. పిదప కూర్మమై.. అంటూ దశావతారాలని హైలెట్ చేసారు రచయిత చంద్రబోస్. ఇక పాట చివర్లో స్వధర్మాన్ని పరిరక్షించగా, సమస్తాన్ని ప్రక్షాళించగా కల్కి వస్తున్నాడని ప్రేక్షకులకు అర్ధమయ్యేట్టు చెప్పాడు.

- Advertisement -

జూన్ 27న భీభత్సమే..

ఇక కల్కి2898AD సినిమాని జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తుండగా, థియేటర్లలో ఇప్పట్నుంచే రచ్చ చేసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, శోభన, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇక కల్కి2898AD సినిమా ఇప్పటికే ప్రీ టికెట్ బుకింగ్స్ ద్వారా 50 కోట్ల వసూళ్ళని దాటేసిన ఈ సినిమా డే 1 కొత్త రికార్డులు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇక కల్కి సినిమా తొలిరోజు దాదాపు 200 నుండి 250 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని సమాచారం. అన్ని కుదిరితే ఓవర్సీస్ సహాయంతో 300 కోట్లు కొట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి కల్కి రికార్డులు బ్రేక్ అయ్యే ఓపెనింగ్స్ కి ఇంకా ఒక్కరోజే అడ్డు ఉంది. జూన్ 27న ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు