Kalki2898AD : విజయ్ దేవరకొండ ఎంట్రీ నెవర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్..!

Kalki2898AD.. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే.. తొలిసారి నేరుగా నటిస్తున్న తెలుగు చిత్రం కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే విడుదలై భారీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.. రూ.700కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో రూ .400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లో మనకు అశ్వద్ధామ గా అమితాబ్ బచ్చన్, యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్, మరియం పాత్రలో శోభన, రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తున్నారంటూ చెప్పిన విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ పాత్ర నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..

Kalki2898AD : Vijay Devarakonda entry Never Before.. Ever After..!
Kalki2898AD : Vijay Devarakonda entry Never Before.. Ever After..!

అయితే ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇంట్రోలోనే కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు ఎక్కడ ప్రకటించలేదు.. కానీ ఉన్నట్టుండి సినిమా థియేటర్లలోకి వెళ్లిన తర్వాత అర్జునుడి గెటప్ లో అశ్వద్ధామను టార్గెట్ చేసే పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. మహాభారత యుద్ధం తో మొదలయ్యే ఈ సినిమా కథ మొదట్లోనే విజయ్ దేవరకొండ ను చూపించారు.. ఇక ఇందులో విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ కూడా సినిమాకు కొత్త ఊపు ను తీసుకొచ్చిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా సినిమా బ్లాక్ బస్టర్ లోడింగ్ అని… ప్రత్యేకించి మొదటి 15 నిమిషాలు అసలు మిస్ కావద్దని చెబుతున్నారు.. దీనికి కారణం ఈ 15 నిమిషాల నిడివిలో విజయ్ దేవరకొండ నటించడమే..

డైలాగ్ తో అదరగొట్టేసిన విజయ్ దేవరకొండ..

రథం మీద ఉన్న అర్జునుడి గెటప్ లో విజయ్ దేవరకొండ.. కింద ఉన్న అశ్వద్ధామను టార్గెట్ చేస్తూ.. విల్లు ఎక్కువ పెట్టి ఇలా చెబుతాడు.. విల్లు ఎక్కువ పెట్టి “తలరాతలు రాసిన బ్రహ్మదేవుడు ప్రసాదించిన గాండీవం ఇది .. దీనిని ఎవరు అడ్డుకోలేరు” అంటూ చెప్పే డైలాగు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తోంది… మొత్తానికి అయితే కేవలం రొమాన్స్ చిత్రాలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఈసారి ఇలా పౌరాణిక పాత్రలో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు ఎక్కడ రివీల్ చేయని చిత్ర బృందం.. చాలా చక్కటి సస్పెన్స్ మైంటైన్ చేసింది. మొత్తానికి అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన నెవర్ బిఫోర్.. ఎవర్ యాక్టర్ అనిపించేశారు.

- Advertisement -

ప్రత్యేక పాత్రల్లో యంగ్ స్టార్స్..

ఇకపోతే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు అని చెప్పడంలో సందేహం లేదు.. ముఖ్యంగా సినిమా మొదటి భాగం వరల్డ్ క్లాసు గా ఉంది.. హాలీవుడ్ లెవెల్ లో సినిమాని నిర్మించారు.. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది. పైగా ఇందులో నాని, దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ వంటి సెలబ్రిటీలు కూడా నటించడం సినిమాకి హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు