Kalyan Ram: అమిగోస్ మొదటి రోజు కలెక్షన్లు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నుంచి తాజాగా వచ్చిన చిత్రం అమిగోస్. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేనీ, యలమంచిలి రవి ప్రకాశ్ నిర్మించారు. మనుషులను పోలిన మనషులు అనే విభిన్నమైన స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి రోజు ఈ చిత్రం మిశ్రమ టాక్ తెచ్చుకుంది.

అయితే, బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా తొలి రోజు ఎలాంటి కలెక్షన్లు చేసిందో ఇప్పుడు చూద్ధం. అమిగోస్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల వరకు జరిగింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బిజినెస్ 14.5 కోట్ల వద్ద ముగిసింది.

ఇక కర్ణాటక లో 80 లక్షలు, ఓవర్సీస్‌లో 90 లక్షల మేర బిజినెస్ జరగింది, దీంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్లకుపై వరకు చేరుకుంది. అలాగే అమిగోస్ ప్రపంచవ్యాప్తంగా 750 స్క్రీన్లలో రిలీజైంది. నైజాంలో 160 స్క్రీన్లు, సీడెడ్‌లో 60 స్క్రీన్లు, ఆంధ్రాలో 210 స్క్రీన్లలో అమిగోస్ ఆడుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 425 స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజైంది. ఇక కర్నాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో 260 స్క్రీన్లలో రిలీజ్ అయింది.

- Advertisement -

అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదని తెలుస్తోంది. మొదటి రోజు అమిగోస్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 3.5 కోట్ల నుంచి 5 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. గతంలో బింబిసార సినిమాకు తొలి రోజు 7.2 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ, ఈ సినిమాకు బింబిసారతో పోల్చుకుంటే తక్కువ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ వీకెండ్ లో పుంజుకుని కలెక్షన్లు పెంచుకుంటే నిర్మాతలకు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా అమిగోస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ 17 కోట్ల వద్ద ఉంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు