Kalyan Ram: బాబాయ్ పేరు ఎత్తగానే చిర్రెత్తిపోతున్న అబ్బాయ్.. ఏమైందబ్బా..?

Kalyan Ram.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి ఫ్యామిలీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఈ కుటుంబం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలు బాగానే సక్సెస్ అవుతున్నారు. కానీ వారి మధ్య సఖ్యత లేకుండా పోతోందని చెప్పవచ్చు. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు వీరందరి మధ్య మంచి సఖ్యత ఉండేది. కానీ ఇప్పుడు ఈ విషయం మూన్నాళ్ళ ముచ్చటగానే మారిపోయింది. పైగా వీరి మధ్య అసలు సంబంధాలే లేవు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Kalyan Ram: What's the matter with the boy who is screaming at the mention of Babai's name?
Kalyan Ram: What’s the matter with the boy who is screaming at the mention of Babai’s name?

బాబాయ్ బాలకృష్ణ పేరు చెప్పగానే కళ్యాణ్ రామ్ ఫైర్..

ఇకపోతే ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ , కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు మంచి అనుబంధం ఉండేది. ఎప్పుడైతే హరికృష్ణ మరణించారో అప్పుడు బాలయ్యకి, ఎన్టీఆర్ కి, కళ్యాణ్ రామ్ కి మధ్య దూరం కూడా పెరిగింది. కళ్యాణ్ రామ్ గత ఏడాది నటించిన డెవిల్ సినిమా డైరెక్టర్ అభిషేక్ నామా డైరెక్టర్ గా పరిచయమయ్యారు.. ఈ సినిమా 80% షూటింగ్ కూడా పూర్తి అయిన తర్వాత అభిషేక్ నామాతో కళ్యాణ్ రామ్ కు విభేదాలు వచ్చాయి. దాంతో ఆయన పేరుకు బదులుగా అభిషేక్ నామ తన పేరు వేసుకున్నారు. డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా బాలయ్యను ముఖ్యఅతిథిగా పిలుద్దామని అభిషేక్ కళ్యాణ్ రామ్ తో తెలిపారట. అప్పటికే విభేదాలు ఎక్కువైన నేపథ్యంలో కళ్యాణ్ రామ్ అభిషేక్ నామాపై సీరియస్ అయ్యారట. ప్రస్తుతం బాబాయ్ ని పిలవాల్సిన అవసరం లేదు.. ఆయన పిలిచినా రాడు.. ఆయన్ని పిలవాలన్న ఆలోచన పెట్టుకోవద్దు.. అసలు ఆయన పేరే నా దగ్గర తీసుకురావద్దు అంటూ కళ్యాణ్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

నందమూరి హీరోల మధ్య విభేదాలు..

అయితే మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాలయ్య చేసినప్పుడు వీరందరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. అయితే కాలక్రమేనా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే వీరి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. వీటికి తోడు చంద్రబాబును గత ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు కూడా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. పైగా ఈ రెండు కుటుంబాలు నారా, నందమూరి ఫ్యామిలీ లకు దూరంగానే ఉన్నాయి.

- Advertisement -

బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా దూరం..

మరోవైపు బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుక త్వరలోనే ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకకు కూడా వీరిద్దరూ హాజరయ్యే అవకాశాలు లేవు. ప్రస్తుతం వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, అందుకే వీరు కలవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నందమూరి ఫ్యామిలీలో చీలికలు ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మొత్తానికి అయితే బాబాయ్ బాలకృష్ణ పేరు చెప్పగానే అబ్బాయిలు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ దూరం జరుగుతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు