Indian 2 : ఇండియన్ 2కు మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎందుకు మార్చారు… రిపొర్టర్‌కి దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన కమల్

Indian 2: కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు కమల్ హాసన్. ఇక తాజాగా కమల్ హాసన్ నటించిన చిత్రం ఇండియన్ 2. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా జూలై 12వ తేదీన రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక 1996 సంవత్సరంలో వచ్చినటువంటి భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తీశారు. దాదాపు 28 సంవత్సరాల అనంతరం ఆ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాని హిందీలో హిందుస్తానీ అని, తమిళంలో ఇండియన్ 2 అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లంచగొండితనాన్ని ఇక ఉపేక్షించేది లేదంటూ…. ఈ సినిమా రాబోతోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

కమలహాసన్ హీరోగా నటించగా….ప్రియా భవాని శంకర్, కాజల్ అగర్వాల్, హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి ప్రముఖ హీరో హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియో కూడా ఈ సినిమా పైన మంచి అంచనాలను పెంచేసింది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చిత్ర బృందం ఆసక్తికరంగా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో బృందంతో జరిగిన ఈవెంట్‌ లో పాల్గొన్న కమలహాసన్.. ఓ రిపోర్టర్ట్‌ కు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చారు.

- Advertisement -

Indian 2: Is there a possibility of Indian 2 being postponed?

ఇండియన్ సినిమాకి ఏర్ రెహ్మన్ మ్యూజిక్ ఇచ్చాడు. మరి పార్ట్ 2 కి రెహ్మన్ కాకుండా అనిరుధ్ ను ఎందుకు తీసుకున్నారని ఓ రిపోర్టర్‌ లేచి..కమల్‌ హాసన్‌ ను ప్రశ్నించారు. ఇక వెంటనే రిపోర్టర్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కమల్‌. అది నా నిర్ణయం కాదు.. డైరెక్టర్ నిర్ణయం. నేను రెహ్మన్ కి ఇళయరాజాకి ఫ్యాన్ ను ఇప్పుడు ఈ సినిమా తర్వాత అనిరుధ్ కి కూడా ఫ్యాన్ కావొచ్చు అంటూ అదిరిపోయే ఆన్సర్‌ ఇచ్చారు కమల్‌. అలాగే.. ఈ సినిమా గురించి కరెక్ట్ కథను గెస్ చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. ఇక జూలై 12వ తేదీన విడుదలయ్యే ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://x.com/CinemaWithAB/status/1806986999393325135

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు