Kamal Haasan About Pawan Kalyan: మీ గురించి నేను గర్విస్తున్నాను

Kamal Haasan About Pawan Kalyan: కమలహాసన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నటుడు. తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్రను వేశారు. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అయ్యాయి. కేవలం ఆ సినిమాలు కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. కమల్ హాసన్ తెలుగు సినిమాల ప్రస్తావన వస్తే ముఖ్యంగా అందరూ మాట్లాడుకునేది విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు గురించి. ఆ సినిమాలను దాటి కమల్ హాసన్ సినిమాల గురించి చెప్పలేము.

Vikram Movie Kamal Haasan

విక్రమ్ సినిమా నిలబెట్టింది

ఇకపోతే కేవలం నటుడుగానే కాకుండా రచయితగా దర్శకుడుగా కూడా తనదైన ముద్రను వేసుకున్నారు కమలహాసన్. ఒక ప్రాపర్ హిట్ సినిమా కమలహాసన్ చేస్తే దాన్ని రిజల్ట్ ఎలా ఉంటుందో అని చాలా సార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇకపోతే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. దాదాపు కమల్ హాసన్ కెరియర్ డౌన్ అయిపోతుంది అనుకున్న తరుణంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత అదే బ్యానర్ లో సినిమాలను నిర్మించడం మొదలు పెడుతున్నారు కమల్ హాసన్.

- Advertisement -

మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది

ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత అధికారం పవన్ సొంతమైంది. ఇకపోతే పవన్ గెలవడంతో చాలామంది పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా పవన్ కళ్యాణ్ కు తన అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ స్పందిస్తూ, ఎన్నికల్లో విజయం అందుకున్నందుకు పవన్ కళ్యాణ్ కు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చినందుకు ఆయన చేస్తున్న ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ తెలిపాను. చాలా మాటలు మాట్లాడుకుంటూ ఎమోషనల్ అయ్యాం. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు