Bharateeyudu2 : అఫిషియల్ అనౌన్స్ మెంట్..ఇండియన్2 రిలీజ్ డేట్ ఫిక్స్..

Bharateeyudu2 : ఉలగ నాయగన్ కమల్ హాసన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు2 (ఇండియన్2) షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా నాలుగేళ్ళ కిందటే మొదలైనా, షూటింగ్ పలు కారణాల వల్ల ఆగిపొయి మళ్ళీ పట్టాలెక్కింది. అయితే దీని వల్ల రామ్ చరణ్ సినిమా ఆగిపోయిందన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, అయితే భారతీయుడు 2 సినిమా ట్రైలర్ గాని, పాటలు గాని ఇప్పటివరకు మళ్ళీ రిలీజ్ అవలేదు. ఇండియన్2 సినిమా రిలీజ్ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడగా, ఇంకా వాయిదా వేసుకుంటూ పోతే సినిమాపై ఉన్న అంచనాలు తగ్గిపోయే ఛాన్స్ ఉందని గ్రహించిన శంకర్, ఏది ఏమైనా రానున్న నెల రోజుల్లోగా ఇండియన్2 షూటింగ్ మొత్తం పనులు పూర్తి చేసి, ప్రమోషన్లపైనే మొత్తం ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇండియన్ 2 గురించి అఫిషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

Kamal Haasan Bharateeyudu2 Movie Release Date Fix

ఎట్టకేలకు భారతీయుడు2 విడుదల తేదీ అనౌన్స్ మెంట్..

ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్2 (Bharateeyudu2) ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇయర్ సంక్రాంతికి విడుదల అవుతుందని లాస్ట్ ఇయర్ నుండి వార్తలు రాగా, పొంగల్ అయిపోగా, సమ్మర్ కే కంఫర్మ్ అనుకుంటే, సమ్మర్ కూడా అయిపోవచ్చింది. మొన్నటివరకు ఇండియన్2 జూలై లో 11 లేదా 17 రిలీజ్ అవుతుంది అని కొన్ని వార్తలు అయితే ఆ మధ్య వచ్చాయి. అయితే ఇప్పుడు అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానే వచ్చింది. భారతీయుడు2 చిత్రాన్ని ఈ ఇయర్ జులై 12న పాన్ ఇండియా భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నామని ఓ పోస్టర్ వదులుతూ అనౌన్స్ చేసేసారు. ఇక ఈ అనౌన్స్ మెంట్ తో కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ అభిమానులు కూడా రిలాక్స్ అయిపోయారు. ఇక ఆల్రెడీ శంకర్, కమల్ లు సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టేసారు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

ఫస్ట్ సాంగ్ కూడా అనౌన్స్..

ఇక భారతీయుడు2 సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి పోస్టర్ ని వదిలి సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇండియన్2 ని ట్రెండ్ లో నిలిపారు. అలాగే మరో క్రేజీ అనౌన్స్ మెంట్ కూడా ఇదే పోస్టర్ లో వదిలారు. ఇండియన్ 2 (Bharateeyudu2) నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని మే 22న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఈ క్రేజీ అప్డేట్ తో కమల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా జోష్ లోకి వచ్చేయగా, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. ఈ సినిమా పూర్తయ్యాక గేమ్ ఛేంజర్ పై శంకర్ ఈజీ గా ఫోకస్ చేస్తాడు. ఇక ఇండియన్ 2 తెలుగులో భారతీయుడు2 పేరుతో, హిందీలో హిందుస్తానీ2 పేరుతో రిలీజ్ అవుతుంది. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె. సూర్య, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఫైనల్ గా జులై 12న రిలీజ్ అవుతుంది. ఇక త్వరలో రిలీజ్ కానున్న ఫస్ట్ సాంగ్ ఎలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు