Indian 2 Audience Response : కమల్ హాసన్ అప్పుడే చెప్పాడు… మన మట్టి బుర్రలకే అర్థం కాలేదు

Indian 2 Audience Response : శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ తన కెరియర్ లో చేసిన అత్యుత్తమమైన సినిమాలలో భారతీయుడు ఒకటి. దాదాపు పాతికేళ్ల క్రితం తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పటికీ కూడా చూస్తున్నప్పుడు ఒక అద్భుతం లా అనిపిస్తుంది. మంచి పాయింట్ను కమర్షియల్ హంగులతో చెప్పకొచ్చాడు శంకర్. ఈ సినిమాను ఎమోషన్స్ని కూడా బాగా వర్కౌట్ చేశాడు. అలానే ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.

శంకర్ సినిమాకి బజ్ లేదు

ప్రతి నటుడికి అలానే ప్రతి దర్శకుడికి తమ కెరియర్లో బెస్ట్ ఫిలిమ్స్ అంటూ కొన్ని ఉంటాయి. అలా ఒక వైపు శంకర కి మరోవైపు కమల్ హాసన్ కి కూడా ఒక ప్రత్యేకమైన సినిమా భారతీయుడు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారు అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. దాదాపు నాలుగు ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు వరకు కూడా సరైన బజ్ కూడా లేదు. శంకర్ సినిమా అంటేనే ఒక హడావిడి ఉంటుంది. ప్రమోషన్స్ కూడా వేరే రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాకి మాత్రం అంతంత మాత్రమే ఎవరికీ చూడాలని మినిమం ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది.

కమల్ హాసన్ ముందే హింట్ ఇచ్చారు

ఇకపోతే ఇండియన్ 2 సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ, నేను ఇండియన్ టు సినిమా చేయడానికి కారణం ఇండియన్ 3 కాన్సెప్ట్ అంత బాగా నచ్చటం అంటూ చెప్పుకొచ్చారు. అయితే అక్కడితోనే చాలామందికి ఇండియన్ 2 సినిమాలో పెద్దగా ఏమీ ఉండదు, ఇండియన్ 3 సినిమా మాత్రం బానే ఉండి ఉండొచ్చు అని ఒక డైలమాలో పడిపోయారు. ఇకపోతే ఇండియన్ 2 సినిమా పైన ఉన్న అంచనాలే అంతంత మాత్రం. కమల్ హాసన్ ఈ మాట చెప్పిన తర్వాత అవి కూడా కొంచెం తగ్గిపోయాయి అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇండియన్ త్రీ లీడ్ కోసమే

ఇకపోతే నేడు సినిమా చూసిన ప్రేక్షకులు అంతా కూడా అసలు ఏం కథ ఉంది ఈ సినిమా తీయడానికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఇండియన్ 3 సినిమాకి లీడ్ ఇవ్వడం కోసమే ఈ సినిమాను తెరకెక్కించారు అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇకపోతే ఇండియన్ 3 ఎలా ఉండబోతుందో ఆల్రెడీ కమల్ హాసన్ తన మాటల్లో చెప్పారు. ఇక రీసెంట్ గా సినిమాను చూసిన ఆడియన్స్ కూడా చివర్లో ఇండియన్ 3 సినిమాకి సంబంధించిన ట్రైలర్ ప్లే అవ్వడంతో , ఆ ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇప్పుడు అంచనాలన్నీ ఇండియన్ త్రీ సినిమా పై పెట్టుకున్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్టు తరువాత చరణ్ ఫ్యాన్స్ లో కూడా కొద్దిగా భయం పట్టుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు