Kamal Haasan : లోక నాయకుడికి తమిళనాట ఘోర అవమానం… పెట్టె సర్దుకునే టైం వచ్చేసిందా..?

Kamal Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో ఎన్నో రోజులుగా ఊరిస్తూ వచ్చిన సినిమా ‘ఇండియన్2’. 1996 లో బ్లాక్ బస్టర్ అయిన ఇండియన్ సినిమాకి 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ గా తెరకెక్కిన ఇండియన్2 నాలుగేళ్లకు పైగా షూటింగ్ జరుపుకుని రీసెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. జులై 12న ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని నెగిటివ్ రెస్పాన్స్ ని మూటగట్టుకుంది. నిజానికి సినిమాపై ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా ట్రైలర్ తర్వాత డీసెంట్ బజ్ ఏర్పడింది. కంటెంట్ బాగుంటుందిలే అన్న నమ్మకంతో థియేటర్లకు వెళ్లిన అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇండియన్2 సినిమా అన్ని విధాలుగానూ మెప్పించలేకపోయింది.

Kamal Haasan Indian 2 movie theaters are empty in Chennai

సొంతగడ్డపై ఘోర పరాభవం…

ఇక ఇండియన్2 సినిమాకి సంబంధించి ఫస్ట్ డే మినహా ఎక్కడా ఓ మోస్తరు కలెక్షన్లు కూడా రావడం లేదు. ఇతర రాష్ట్రాల్లో అంటే పర్వాలేదు… కానీ సొంత గడ్డ అయిన తమిళనాడు లో కూడా సినిమాకు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. తొలి రోజు అక్కడ కేవలం 13 కోట్ల రూపాయలు ఇండియన్2 వసూలు చేస్తే, అదే రోజు తెలుగు రాష్ట్రాల్లో 10.48 కోట్లు వసూలు చేసింది. అంటే తమిళనాడు ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఇంకాస్త బెటర్ గా సినిమాని ఆదరించారు. కానీ రెండో రోజుతో తమిళనాడు ప్రేక్షకులు మొత్తం కమల్ సినిమాని పూర్తిగా రిజెక్ట్ చేసారని చెప్పాలి. లేటెస్ట్ న్యూస్ తో క్లారిటీ వచ్చేసింది.

- Advertisement -

కమల్.. తట్టా బుట్టా సర్దుకునే టైం వచ్చిందా?

తాజాగా ఇండియన్2 సినిమాకి ఘోర అవమానం జరిగిందనే చెప్పాలి. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో చాలా చోట్ల ఇండియన్2 కి డెఫిసిట్ లు, నెగిటివ్ షేర్లు వస్తున్నాయ్. ఇప్పుడు ఏకంగా ఇండియన్2 సినిమాని తీసేసి, ప్రభాస్ కల్కి సినిమాని రీప్లేస్ చేస్తున్నారట. ఇది కమల్ హాసన్ కి (Kamal Haasan) ఘోర అవమానమే అని చెప్పాలి. చెన్నైలో దాదాపు 80 థియేటర్లలో ఇండియన్2 తీసేసి కల్కి2898AD సినిమా భర్తీ చేసారు బయ్యర్లు. ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ ని శాసించిన లోకనాయకుడి సినిమాకు ప్రేక్షకులు ఇంతలా రిజెక్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో కమల్ హాసన్ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కమల్ నటించిన ఇంతకు ముందు సినిమాలు ప్లాప్ అయినా ఇంత దారుణంగా వారం రోజులకే థియేటర్లలోంచి తీసేయలేదు. దీంతో కమల్ హాసన్ ఇండియన్2 తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకోక తప్పేట్టు లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు