Indian2 : కెరీర్ బెస్ట్ రికార్డు సినిమాపై కన్నేసిన కమల్.. ఈ హైప్ తో సాధ్యమవుతుందా?

Indian2 : లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్2 మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తో పాటుగా కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ఎస్.జె. సూర్య, బాబీ సింహ వంటి తారాగణం నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక శంకర్, కమల్ హాసన్ ఆఫ్టర్ లాంగ్ టైం కలిసి చేస్తున్న ఈ సూపర్ హిట్ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉండగా, వచ్చిన టీజర్, సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. ఫైనల్ గా జులై 12న సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాతో కమల్ హాసన్ భారీ వసూళ్ళని టార్గెట్ గా పెట్టుకున్నాడని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో ఈ సినిమా (Indian2) ఓపెనింగ్స్ కోసం కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది.

Kamal Haasan is looking to break Vikram's records with Indian2

కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ పై కన్నేసిన కమల్..

ఇక ఇండియన్ 2 (Indian2) సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా తో రికార్డు ఓపెనింగ్స్ కొల్లగొట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే రెండేళ్ల కింద అసలేమాత్రం ఫామ్ లో లేని కమల్ హాసన్ ఖాతాలో విక్రం తో సెన్సేషనల్ హిట్ పడేలా చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కమల్ కెరీర్ కు విక్రమ్ బ్లాక్క్ బస్టర్ హిట్ ఇచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా 450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కమల్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. అయితే ఇప్పుడు ఇండియన్ 2 తో కూడా కమల్ హాసన్ మళ్లీ అదే టార్గెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఇండియన్ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ఇండియా లోనే హైయెస్ట్ గ్రాసర్ లలో ఒకటిగా నిలిచింది ఆ ఏడాది. ఇక ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెబుతున్నారు. అయితే బిజినెస్ పరంగా కమల్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఇండియన్ 2 బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.

- Advertisement -

విక్రమ్ వసూళ్లే టార్గెట్..

ఇక శంకర్ షణ్ముగం కూడా సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి, ఇండియన్ 2 ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతుందని అంటున్నారు. అయితే విక్రమ్ రేంజ్ లో 400 కోట్లు సాధ్యమయ్యే పనేనా అంటే.. శంకర్ సినిమా హిట్ టాక్ వస్తే అదేమంత పని కాదు. కమల్ హాసన్ కూడా సక్సెస్ ఫాం లో ఉన్నాడు కాబట్టి, ఇండియన్ 2 తో మరోసారి విక్రం రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇండియన్ 2 కథ, కథనాలు అన్ని పర్ఫెక్ట్ మీటర్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. అందుకే మేకర్స్ సినిమా రిజల్ట్ మీద అంత నమ్మకంగా ఉన్నారు. మరి ఇండియన్ 2 నిజంగానే విక్రమ్ కలెక్షన్స్ ని అందుకుంటుందా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. ఇక ఇండియన్ 2 కి ఓపెనింగ్స్ తోనే విక్రమ్ రికార్డులు బ్రేక్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి భీభత్సం క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు