Indian 2: మాట మార్చేసిన కమల్ హాసన్, ఇండియన్ 2 పై సరికొత్త వ్యాఖ్యలు

Indian 2: జెంటిల్మెన్ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శంకర్. శంకర్ దర్శకుడు కావడానికి అంటే ముందు దాదాపు 17 ఏళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. శంకర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలు అని అనుకుంటున్న తరుణంలో, అప్పట్లోనే పాన్ ఇండియా కాన్సెప్ట్ సినిమాలు తెరకెక్కించాడు. శంకర్ తీసిన సినిమాలన్నీ కూడా విజువల్ వండర్స్ అనిపించుకునేవి. ఇక శంకర్ తీసిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా వస్తుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ ఎస్ జె సూర్య, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ కాస్ట్ కనిపించనుంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు దాదాపు 4ఏళ్ల తర్వాత రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఈ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదారాబాద్ లో నిర్వహించారు.

INDIAN 2

- Advertisement -

ఇండియన్ 2 సినిమా చేయడానికి గల ముఖ్య కారణం ఇండియన్ 3 సినిమా స్టోరీ నచ్చడం అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియన్ టు సినిమా కంటే ఇండియన్ త్రీ సినిమా అద్భుతంగా ఉండబోతుంది అంటూ కమల్ అన్నారు. ఇక రీసెంట్గా ఇండియన్ టు ట్రైలర్ కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. అయితే ఇండియన్ త్రీ గురించి కమల్ హాసన్ ఇప్పుడు చెప్పడంతో ఇండియన్ టు సినిమా పైన అంచనాలు డ్రాప్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు కమల్ దానిని సరిచేస్తూ ఇండియన్ 2, ఇండియన్ 3 సేమ్ రేంజ్ అంటూ కవర్ చేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు