Kamal Haasan : ఈ వయస్సులో ఇంత రిస్క్ అవసరమా కమల్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్…

Kamal Haasan : తమిళ హీరో, విలక్షణ నటుడు కమల్ హాసన్ ( Kamal Haasan ) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య విలక్షణ పాత్రల్లో, విలన్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. ఎటువంటి పాత్రలోనైన ఇట్టే పరాయక ప్రవేశం చేసి జీవించేస్తాడు. కమల్ సినిమాలకు ఎంతగా అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రీసెంట్ గా ఈయన తెలుగులో కల్కి( Kalki ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు వరుసగా ఆఫర్స్ ఆయన తలుపు తడుతున్నాయి. ఇక తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ సినిమాకు ఆయన రిస్క్ చేస్తున్నాడని ఓ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

కమల్ హాసన్ కొత్త టెక్నాలజీ నేర్చుకునేందుకు అమెరికా వెళ్లాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకురానుందని అంటున్నారు. మీరు ఏమీ నేర్చుకోకపోయినా, మీరు కృత్రిమ మేధస్సు లేదా AI భాష నేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఈ ప్రత్యేక కోర్స్ నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడే 90 రోజులు ఉండబోతున్నారు. అప్పటివరకు నో సినిమా షూటింగ్ అని తెలుస్తుంది.

Kamal Haasan who is following technology.. Shocked fans
Kamal Haasan who is following technology.. Shocked fans

ఈ కోర్సు కోసమే కమల్ హాసన్ ఇప్పటికే అమెరికా వెళ్లగా, మరో 45 రోజుల పాటు అక్కడే ఉండి ఏఐ కోర్సును నేర్చుకోనున్నారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రానున్నారు. 45 రోజుల పాటు షూటింగ్ వర్క్ లేకపోవడంతో కమల్ హాసన్ ఏఐ కోర్సులో చేరారు.. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఈ వయస్సులో రిస్క్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. కమల్ హాసన్ ఇటీవల నటించిన భారతీయుడు 2 ( Bharateeyudu 2) అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ మొదటి పార్ట్ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. అయితే ప్రభాస్ తో కలిసి కమల్ నటించిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆయన పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. కల్కి రెండో పార్ట్ లో కమల్ హాసన్ పాత్ర మరింత స్ట్రాంగ్ గా ఉండబోతుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు