Kamal Hasan : ఆ సినిమాలో విలన్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన కమల్.. ఎందుకంటే?

Kamal Hasan : కోలీవుడ్ స్టార్ లోకనాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రెండేళ్ల కింద విక్రమ్ ఇచ్చిన సూపర్ జోష్ తో వరుస భారీ ప్రాజెక్ట్ లని చేస్తున్న కమల్ హాసన్ తొందర్లోనే ఇండియన్ 2 సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇండియన్ 2 సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం సౌత్ ఇండియా మూవీ లవర్స్ కళ్ళు దీనిపైనే ఉన్నాయి. ఈ ఇయర్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ లలో ఒకటిగా కల్కి2898AD మూవీ రిలీజ్ కాగా, రెండో పెద్ద సినిమాగా ఇండియన్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాను తెలుగులో భారతీయుడు2 పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియన్2 మూవీ ప్రమోషన్లలో ఉన్న కమల్ హాసన్ (Kamal Hasan) అన్ని భాషల్లోనూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇండియన్ 2 గురించి ప్రస్తావిస్తూ ఓ ఇంటర్వ్యూ లో కమల్ శంకర్ తో ఇంతకు ముందు తీయాల్సిన సినిమాల గురించి ప్రస్తావించాడు.

Kamal Hasan rejected the villain offer in 2.0

రోబో ని రిజెక్ట్ చేసిన కమల్…

ఇక కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉండగా, ఆ ఇంటర్వ్యూ లో కమల్ హాసన్ ఇంతకు ముందు శంకర్ సినిమాలని రిజెక్ట్ చేసిన విషయాన్నీ ప్రస్తావించాడు. నిజానికి శంకర్ రజిని రోబోని కమల్ హాసన్ చేయాల్సింది. కమల్ హాసన్ ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ… ‘రోబో’ సినిమాలో హీరో పాత్రకు ముందుగా తననే ఎంపిక చేశారని, అయితే.. అప్పటి తన మార్కెట్‌ దృష్ట్యా ఆ సినిమా చేయకపోవడమే మంచిదని ఇష్టం లేకపోయినా సినిమా వదులుకున్నట్లు కమల్ హాసన్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అంతే కాక 2.0 సినిమాలో కూడా విలన్ గా ఆఫర్ ని రిజెక్ట్ చేసారు కమల్. ఆ సినిమాలో విలన్ పాత్ర తనకు సూట్ కాదని భావించానని, అందుకే ఆ రోల్ ని కూడా రిజెక్ట్ చేసానని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఆ పాత్రని అక్షయ్ కుమార్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇండియన్ 2 తరవాత ఇండియన్3…

ఇక కమల్ హాసన్ విలన్ గా నటించిన కల్కి సినిమా థియేటర్లలో దుమ్ము లేపుతుంది. ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్ గా నటించిన కమల్ హాసన్ తక్కువ సేపే స్క్రీన్ పై కనిపించినా, ప్రేక్షకులని తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో భయపెట్టి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు జులై 12న ఇండియన్2 సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇప్పటికే సినిమా మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో సెన్సార్ కి కూడా వెళ్లబోతుండగా, ఈ సినిమా ఫినిష్ అయ్యాక ఇండియన్ 3 కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ తరవాతే ఆ సినిమా ఉంటుంది. అంటే 2025 సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు