Kamal Hassan: ఇండియన్ 2 స్టోరీని ఎవరూ గెస్ చేయలేరు… హింట్ ఇచ్చిన కమల్

Kamal Hassan: భారతీయ సినిమా చరిత్రలో ఉన్న టాలెంటెడ్ నటుల పేర్లు బయటకు వస్తే అందులో మొదటగా వినిపించే పేరు కమల్ హాసన్ అని చెప్పొచ్చు. ఎన్నో అద్భుతమైన సినిమాలు కమల్ హాసన్ తన కెరియర్లో చేశారు. ఎలాంటి పాత్ర అయినా అందులో ఒదిగిపోవడం ఆయనకి చాలా సులువైన పని. తాజాగా ఆయన హీరోగా నటించిన భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే కమల్ సినిమా కథ గురించి హింట్ ఇచ్చాడు.

ఇండియన్ 2 స్టోరీపై హింట్

ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమాను చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటిలోనే ఒక అద్భుతమైన థాట్ ను సినిమాగా తెరకెక్కించాడు శంకర్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అలానే ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా ఆ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 వస్తుంది.

Kamal Haasan Address and Contact Number Website

- Advertisement -

ఈ సినిమా జులై 12న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఇదివరకే రిలీజ్ అయిన ఆడియో కూడా సినిమా పైన మంచి అంచనాలను పెంచింది. ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇండియన్ 2 సినిమా గురించి ట్విట్టర్లో చాలా థియరీలను చూశాను. కానీ ఎవరూ కూడా సినిమా గురించి కరెక్ట్ స్టోరీని గెస్ చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా ప్రేక్షకుల ఊహకు అందని విధంగా శంకర్ ఏదో ప్లాన్ చేశాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

కమల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?

కమల్ హాసన్ పేరుకు తమిళనాడు అయినా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన సినిమాలు ఎన్నో అద్భుతమైన హిట్స్ గా నిలిచాయి. స్వాతిముత్యం, సాగర సంగమం, సప్తపది వంటి సినిమాలు కమల్ హాసన్ లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటకు తీసి ప్రేక్షకులను ఏడిపించేలా చేశాయి. అలానే కమల్ హాసన్ తమిళంలో నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి, అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఆకలి రాజ్యం, వసంత కోకిల, భారతీయుడు, నాయకుడు వంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే కమల్ హాసన్ కేవలం హీరో గానే కాకుండా రచయిత, దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. కమల్ హాసన్ ఆలోచనలు ఎప్పుడూ కూడా విభిన్నంగా ఉంటాయని చాలాసార్లు రుజువు అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు కమల్ హాసన్ ఇండియన్ 2పై చేసిన కామెంట్స్ చూస్తుంటే ఈ సినిమా విషయంలో కమల్ డీఫెరెంట్ స్ట్రాటజీలో ప్రమోషన్స్ చేస్తున్నాడు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు