Kamal Hassan: కల్కి సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ రియాక్షన్, పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kamal Hassan: ప్రస్తుతం అంతా కల్కి సినిమా హావా నడుస్తుంది. మైథిలాజికల్ సైన్స్ ఫిక్స్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగిపోతుంది. ఈ సినిమా మొదటి రోజే దాదాపు 191 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ కనిపించింది. అలానే సినిమాలో కూడా ఈ పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంది.

కల్కి సినిమా చూసిన తర్వాత ప్రభాస్ పాత్రతో పాటు అమితాబచ్చన్ పాత్ర గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మాత్రం సినిమాకి అసలైన హీరో అమితాబచ్చన్ అంటూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సినిమాలో ప్రతిపాత్రను చాలా బాగా డిజైన్ చేసి అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇకపోతే ఈ సినిమాలో సుప్రీం ఎస్కిన్ అనే పాత్రలో కనిపించారు కమల్ హాసన్. సినిమాలో కనిపించింది తక్కువ సేపు అయినా కూడా, కనిపించినంత సేపు కూడా నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ స్పందించారు.

Kamal Haasan about his role in 'Kalki 2898 AD'

- Advertisement -

కల్కి రెండో పార్ట్లోనే నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నాకు ముందే చెప్పారు. కేవలం ఓ అభిమానిగా పార్ట్-1 షూటింగ్లో పాల్గొన్నా. ప్రస్తుతం ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్కు ఓపిక చాలా ఎక్కువ. పురాణాలను సైన్స్ను ముడిపెట్టి కల్కిని అద్భుతంగా రూపొందించారు. చాలా ఓపిగ్గా కల్కి కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు” ఇక పార్ట్ 2 దాదాపు స్టోరీ అంతా కూడా కమల్ హాసన్ పై ఆధారపడి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు