Kamal Haasan: ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్ సోదరుడు.. బులెటిన్ వదిలిన సుహాసిని..!

Kamal Haasan: విశ్వ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆరు పదుల వయసు దాటినా కూడా వరుస చిత్రాలలో, అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలలో కూడా అదరగొట్టేస్తున్నారు. ఇటీవల ఈయన నటించిన కల్కి 2898AD సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా ఇందులో ఈయన యాస్కిన్ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనను మరొకసారి అందరికీ పరిచయం చేశారు. ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు కమలహాసన్ సోదరుడైన చారు హాసన్ హాస్పిటల్ లో చేరారు.

Kamal Hassan: Kamal Hassan's brother admitted to the hospital.. Suhasini left a bulletin..!
Kamal Hassan: Kamal Hassan’s brother admitted to the hospital.. Suhasini left a bulletin..!

హాస్పిటల్లో చేరిన చారుహాసన్..

అనారోగ్యం కారణంగా చారుహాసన్ ఆసుపత్రిలో. చేరగా ఈ విషయాన్ని ఆయన కుమార్తె, ప్రముఖ సినీనటి సుహాసిని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 93 ఏళ్ల చారుహాసన్ ఆసుపత్రిలో చేరడంతో ఆయనకి ఏమైందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇక సుహాసిని ఆసుపత్రి బెడ్ పై ఉన్న తన తండ్రిని హత్తుకున్న ఫోటోని కూడా ఆమె షేర్ చేశారు. వైద్యులు, ప్రజల ప్రేమాభిమానాలు , నర్సుల సంరక్షణతో నాన్నా త్వరగా కోలుకుంటున్నారు అంటూ సుహాసిని కామెంట్స్ చేశారు. అయితే చారు హాసన్ అనారోగ్యానికి సంబంధించిన విషయాలను మాత్రం ఆమె పంచుకోలేదు.

చారుహాసన్ సినిమాలు..

చారు హాసన్ విషయానికి వస్తే , నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ , హిందీ వంటి అనేక భాషా చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక అభిమానాన్ని దక్కించుకున్నారు. తెలుగులో 2023లో అవికా ఘోర్ నటించిన పాప్ కార్న్ సినిమాలో నటించిన ఈయన చివరిగా విజయ్ శ్రీ జీ దర్శకత్వంలో వచ్చిన హరా అనే సినిమాలో నటించారు. ఇదిలా ఉండగా కమలహాసన్ ఇంకో సోదరుడు చంద్రహాసన్ 2017 లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే . ఇక ఇప్పుడు చారుహాసన్ హాస్పిటల్ లో ఉండడంతో కమల్ హాసన్ తో పాటు చారుహాసన్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

సుహాసిని కెరియర్:

చారుహాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన సుహాసిని ఏ రోజు కూడా తన బాబాయ్ కమల్ హాసన్ ఇమేజ్ను ఆమె ఉపయోగించుకోలేదు. అంతేకాదు ఆ కుటుంబంతో ఈమె కలిసి కనిపించిన దాఖలాలు కూడా లేవనే చెప్పాలి. ఫిలిం డైరెక్టర్ మణిరత్నం ను ఈమె ప్రేమించే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక భర్త దర్శకత్వంలో కూడా పలు చిత్రాలు చేసింది సుహాసిని. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె తెలుగు హీరోలందరి సరసన నటించి మెప్పించింది..ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో హీరోలకు తల్లిగా, అత్తగా.. హీరోయిన్లకు పెళ్లి పాత్రలో నటిస్తూ మెప్పిస్తోంది. ఇక ప్రస్తుతం తన తండ్రి చారుహాసన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Suhasini Hasan (@suhasinihasan)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు