Kamal Hassan: ఇండియన్ 2 ఆడియో లాంచ్ కి ఈ ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ వచ్చారు

Kamal Hassan: కమలహాసన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కమల్ సినిమా కెరియర్ సన్నగిల్లింది అనుకునే టైంలో విక్రమ్ అనే సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేశాడు లోకేష్ కనకరాజ్. విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను వసూలు చేసింది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మామూలుగా ఉన్న అంచనాలను విక్రమ్ సినిమా చూసేముందు ఖైదీ సినిమా చూడండి అంటూ వేరే రేంజ్ లో లేపాడు. ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడితో మళ్ళీ కమలహాసన్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.

నెల్సన్ దిలీప్ కుమార్

ఇకపోతే ప్రస్తుతం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ దర్శకులలో నెల్సన్, లోకేష్ కనకరాజ్, హెచ్ వినోద్ ఒకరు. కొలమావు కోకిల అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత చేసిన వరుణ్ డాక్టర్ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బీస్ట్ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. మళ్లీ రజనీకాంత్ జైలర్ అనే సినిమాను చేసి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాడు. బీస్ట్ సినిమాతో పోగొట్టుకున్న దాన్ని జైలర్ సినిమాతో రెట్టింపుగా సాధించాడు నెల్సన్ దిలీప్ కుమార్.

Kamal Hassan: These three young directors came to Indian 2 audio launch

- Advertisement -

లోకేష్ కనకరాజ్

లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మానకరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ తర్వాత కొన్ని సినిమాలతో బీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు లోకేష్ నుంచి ఒక సినిమా వస్తుందనంటే సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. అలానే హెచ్ వినోద్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ హీరో అజిత్ తో అద్భుతమైన హిట్ సినిమా చేశాడు. ఇకపోతే ఈ ముగ్గురు డైరెక్టర్స్ ఇండియన్ 2 ఆడియో లాంచ్ కి హాజరయ్యారు.

త్వరలో రిలీజ్ కానుంది

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా చేస్తున్న సినిమా ఇండియన్ టు. ఇండియన్ అనే సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా పాటలు కూడా నేడు రిలీజ్ అయ్యాయి. ఈ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను త్వరలో రిలీజ్ అయిన సందర్భంగా ఆడియో లాంచ్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు