Kamala Haasan: న్యాయం కోసం పోరాటం – కమల్ హాసన్ మాజీ భార్య..!

Kamala Haasan.. విశ్వనటుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూనివర్సల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని రెండు పెళ్లిళ్లు చేసుకొని వారితో విడిపోయారు. అలా విడిపోయిన వారిలో నటి గౌతమి కూడా ఒకరు. కొంతకాలం సహజీవనం చేసి ఆ తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. గౌతమి(Gautami) కూడా కమలహాసన్(Kamala Haasan) తో విడిపోయిన తర్వాత 2016 నుండి ఒంటరిగానే ఉంటోంది. ఇప్పటికే పెళ్లి చేసుకోకుండా అడపా దడపా అవకాశాలు రావడంతో సినిమాలలో నటిస్తూ.. కెరియర్ లో ముందుకు దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా, తాజాగా న్యాయం కోసం పోరాటం చేస్తోంది గౌతమి అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Kamala Haasan: Fight for justice - Kamal Haasan's ex-wife..!
Kamala Haasan: Fight for justice – Kamal Haasan’s ex-wife..!

ఘోరంగా మోసపోయిన గౌతమి..

అసలు విషయంలోకెళితే, గౌతమి ఒక భూ వ్యవహారంలో ఘోరంగా మోసపోయిందని, ఈ విషయంలో తనకు న్యాయం జరగాలి అని, దాదాపు ఏడాది కాలంగా పోరాటం చేస్తూనే వస్తోంది. న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని కూడా గౌతమి తెలిపింది. మరి ఎక్కడ ఈమె భూమి విషయంలో మోసపోయింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడులోని రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి ఒక స్థలం ఉంది. దానిని కార్తెక్కుడికి చెందిన అళగప్పన్ కబ్జా చేశాడట. అంతేకాదు దానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను కూడా సృష్టించి, ఆ స్థలాన్ని అమ్మేశారట. దాదాపు రూ.3కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని తన ప్రమేయం లేకుండా కబ్జా చేయడమే కాదు, తన స్థలాన్ని విక్రయించడంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భూ వ్యవహారంలో మోసం..

ఇక గౌతమి చేసిన ఫిర్యాదులో అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, ఆయన కొడుకు శివ , కోడలు ఆర్తి ఇంకా కొంతమంది బంధువుల పైన గౌతమి కేసు పెట్టారు. కేసు నమోదైన వెంటనే ఆ నిందితులు బెయిల్ తెచ్చుకున్నారు. ఏడాదిగా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారట. దీంతో మరోసారి నిందితులు బెయిల్ పిటిషన్ పెట్టుకోవడంతో ఈ కేసు సోమవారం కాస్త విచారణకు వచ్చింది. దీనిపై స్పందించిన గౌతమీ తరఫు లాయర్ ఈ కేస్ కి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ఉండాలని వాదించారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది..? మరి గౌతమికి న్యాయం జరుగుతుందా? వంటి ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తున్నాయి. మరి ఆ నిందితుల బెయిల్ కి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి గౌతమికి తన వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి. వాటిని సమర్పిస్తుందా.? ఒకవేళ సమర్పిస్తే భూమి తనకి తిరిగి వస్తుందా ? అనే విషయాలపై ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా గౌతమి ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచింది.

- Advertisement -

గౌతమి కెరియర్..

గౌతమి కెరియర్ విషయానికి వస్తే, ఒకప్పుడు చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ , అనతి కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ మరింతగా మెప్పిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్న గౌతమి ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు