Kanchana 4: హార్రర్ మూవీకి మరో సీక్వెల్.. షూటింగ్ అప్పటినుంచే

Kanchana 4: కాంచన.. 2011 జూలై 15న లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన తమిళ రీమేక్ హార్రర్ మూవీ.. లారెన్స్, శరత్ కుమార్ , కోవై సరళ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బానర్ పైన బెల్లంకొండ సురేష్ నిర్మించగా.. ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.. తమిళంలో విడుదలైన ముని 2 సినిమాకు రీమేక్ గా తెలుగులో కాంచన అంటూ విడుదల చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ సినిమాలో వచ్చిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టేసింది. ఇక ఇందులో హీరోయిన్గా లక్ష్మీరాయ్ నటించగా దేవదర్శిని, శ్రీమన్, మయిల్ సామి కీలకపాత్రను పోషించారు.

కాంచన -4:

Kanchana 4: Another sequel to the horror movie.. from then shooting
Kanchana 4: Another sequel to the horror movie.. from then shooting

ఇక ఈ సినిమా తర్వాత కాంచన 2 ,కాంచన 3 సినిమాలు కూడా విడుదలైన విషయం తెలిసిందే..
ఇక ఇప్పుడు కాంచన 4 కూడా రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమాకి కచ్చితంగా దర్శకత్వం రాఘవ లారెన్స్ వహిస్తారని అందులో కూడా ఆయన నటిస్తారని సమాచారం.. ఇకపోతే సెప్టెంబర్ నెల నుంచి ఈ కాంచన 4 సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కాబోతోందట. మరి ఈ సినిమాను హారర్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.. మరి ఈ కాంచన సీక్వెల్స్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

కాంచన -2

ఇక కాంచన 2 విషయానికి వస్తే.. 2015 లో విడుదలైన ఈ తమిళ భాష హార్రర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో రాఘవ లారెన్స్ ద్విపాత్రాభినయం చేయడమే కాదు ఈ సినిమాకి రచన, నిర్మాణం, దర్శకత్వం కూడా వహించారు . ఇది ముని లోని మూడవ భాగం.. ఇక ఈ సినిమాలో నిత్యమీనన్, తాప్సీ పన్ను ప్రధాన హీరోయిన్లుగా నటించగా.. కోవై సరళ కీలక పాత్ర పోషించారు.. 2015 ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

- Advertisement -

కాంచన -3

కాంచన 3 విషయానికి వస్తే.. కామెడీ హర్రర్ జానర్ లో 2019 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.. మంచి విజయాన్ని అందుకోవడమే కాదు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుందని చెప్పవచ్చు ఇందులో రాఘవ లారెన్స్ ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇక ఇందులో వేదిక , రాఘవ లారెన్స్ తో పాటు ఓవియా నికి తంబోలి నటించారు . రాఘవేంద్ర పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో మైనానందిని కబీర్ సింగ్ దుహ ప్రియాంక నల్కారి కీలకపాత్రలు పోషించారు.

మంచి మనసు చాటుకున్న లారెన్స్..

ఇక రాఘవ లారెన్స్ మంచి మనసు విషయానికి వస్తే.. ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టిన ఈయన ఎంతోమంది అనాధలకు కడుపు నింపి గొప్ప మనసు చాటుకుంటున్నారు. ముఖ్యంగా అనాధాశ్రమాలను నిర్మించి వాటిని నిర్వహిస్తూనే.. ఎంతోమంది పేద పిల్లలను చేరదీస్తున్నారు.. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత భాగం ఇక ఇప్పుడు అనాధాశ్రమాలకు పంచి పెడుతూనే .. పలుసేవ కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు రాఘవ లారెన్స్. మరోవైపు వరస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు