Kangana Ranaut : మరో వివాదంలో కంగనా.. హైకోర్టు నోటీసులు..!

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే.. ఈ బ్యూటీ సినిమాల కన్నా కూడా వివాదాలతో ఫేమస్ అవుతుంది.. ఎప్పుడూ ఏదొక న్యూస్ తో వివాదాలను కొని తెచ్చుకుంటున్న కంగనా ఇప్పుడు మరో చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. ఇటీవల ఎంపీగా పోటి చేసి గెలుపొందిన ఈమెకు తాజాగా హైకోర్టు నోటీసులు పంపించింది.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.. అసలు నోటిఫికేషన్ ఎందుకు అనేది ఇప్పుడు వివరంగా తెలుస్తుందాం..

కంగనా రనౌత్ సినిమాల పరంగా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. అలాగే తనకు ఏ మాత్రం సంబంధం లేని విషయాల్లో కూడా ఆమె తల దూర్చి ఇండస్ట్రీలో అందరి కోపానికి కారణం అయ్యింది.. ఆమెను బహిష్కరించిన విషయం కూడా తెలిసిందే.. అయితే తన సినిమాలను తానే చేసుకుంటూ బిజీగా గడుపుతుంది. అలాగే ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. బీజేపీ ఎంపీగా పోటి చేసి గెలిచింది.. ప్రస్తుతం సినిమాలను తగ్గించి రాజకీయాల్లో చురుగ్గా ఉంటుంది.. తాజాగా ఈమెకు హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వివరాల్లోకి వెళితే..

Kangana in another controversy.. High Court notices..!
Kangana in another controversy.. High Court notices..!

జ్యోత్స్నా రేవాల్ కంగనాకు నోటీసులు ఇచ్చారు.. మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను కావాలనే పక్కన పెట్టారని కిన్నౌర్ నివాసం లాయక్ రామ్ నేగి ఆరోపించారు.. కంగనా ఇందుకు అర్హురాలు కాదని ఆయన లాయర్ నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో పాల్గొనేందుకు అన్ని పత్రాలను జతచేసిన కూడా నామినేషన్స్ ను తిరష్కరించారు.. లాయక్ పిటీషన్ పై ఆగస్టు 21లోపు వివరణ ఇవ్వాలని కంగనాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మరి కంగనా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు