Kangana Ranaut: అప్పుల్లో బాలీవుడ్ క్వీన్.. అమ్మకానికి పెట్టిన ఖరీదైన బంగ్లా..!

Kangana Ranaut.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమాలు, పలు రకాలు వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బును వివిధ మార్గాలలో పెట్టుబడులుగా పెడుతుంటే, మరికొంతమంది సంపాదించిన వాటిని అమ్ముకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న రోల్స్ రాయిస్ కారును రూ.2.6 కోట్లకు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయం నుంచి బయటపడకనే అప్పుడే మరొక విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Kangana Ranaut: Bollywood queen in debt.. expensive bungalow for sale..!
Kangana Ranaut: Bollywood queen in debt.. expensive bungalow for sale..!

ఖరీదైన బంగ్లాను అమ్మకానికి పెట్టిన కంగనా..

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్, అక్కడ ఫైర్ బ్రాండ్ గా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె తన ఖరీదైన బంగ్లాను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై.. అక్కడ వున్న పాలిహిల్ ఏరియాలో నిర్మించుకున్న ఒక బంగ్లాను రూ .40 కోట్లకు విక్రయించనున్నట్లు ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బంగ్లాను కంగనా నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ ఆఫీసుగా వినియోగిస్తున్నారట. అక్రమ నిర్మాణం అంటూ 2020లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొంతవరకు కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బంగ్లాను అమ్మకానికి పెట్టడంతో అభిమానులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏకంగా అప్పుల్లో మునిగిపోయిందా అందుకే ఈ బంగ్లాను అమ్మకానికి పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందుకు గల నిజానిజాలు కంగనా రనౌథ్ తెలియజేయాల్సి ఉంటుంది.

కంగనా కెరియర్..

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ గా రికార్డు సృష్టించిన ఈమె.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో ఈమె తర్వాతే ఎవరైనా. అందుకే అందరూ ఈమెను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో కూడా ఈమె మొదటి స్థానంలో ఉంటుంది. ఇకపోతే తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న కంగనా, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కించుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా లో జన్మించిన ఈమెను డాక్టర్ చేయాలని ఆమె తల్లిదండ్రులు ఎంతగానో అనుకున్నారట. కానీ ఆమె మాత్రం 16వ ఏటనే తన కెరీర్ ను ఎంచుకొని ఢిల్లీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మోడల్ అయి డైరక్టర్ అరవింద్ గౌడ్ దగ్గర నటనలో శిక్షణ తీసుకొని, 2006లో గ్యాంగ్ స్టర్ సినిమాతో అరంగేట్రం చేసింది. అంతేకాదు ఈ సినిమాకి ఉత్తమ నటి డెబ్యూ క్యారెక్టర్ లో ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

- Advertisement -

రాజకీయరంగంలో కూడా సక్సెస్..

ఇక తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి కమర్షియల్ హీరోయిన్ గా కూడా పేరు దక్కించుకున్న ఈమె రాజకీయ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఇటీవల బీజేపీ తరఫున ఎంపీగా మండీ నుండి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే భారీ మెజారిటీతో గెలుపొందింది. సినిమా రంగంలో సక్సెస్ అయిన ఈమె రాజకీయ రంగంలో కూడా గెలుపొందింది. మరి ప్రజల మన్ననలు ఏ మేరకు పొందుతుందో చూడాలి. ప్రస్తుతం బంగ్లాను అమ్మకానికి పెట్టి మళ్లీ వార్తల్లో నిలిచింది కంగనా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు