Kangana Ranaut : అనుకున్నదానికంటే గ్రాండ్ గా గెలిచేసిన బాలీవుడ్ క్వీన్ కంగనా!

Kangana Ranaut : దేశవ్యాప్తంగా నేడు పలు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలలో అసెంబ్లీ, అలాగే లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో పలువురు రాజకీయ నేతలు ఘన విజయం సాధించగా, పలువురు సినీ సెలబ్రిటీ లు కూడా పోటీ చేసి విజయం సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు ఇప్పటికే గ్రాండ్ విక్టరీని నమోదు చేసారు. అలాగే సౌత్ టు నార్త్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు ఎన్నికలలో తమ సత్తా చాటారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కు దాటింది. అయితే గతం కంటే భారీగా సీట్లు కోల్పోయిన బీజేపీ ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిసి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించి.. ఆ రాష్ట్రాన్ని క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఘన విజయం సాధించారు. కంగనా రనౌత్‌ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన విక్రమాదిత్యపై 74755 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Kangana Ranaut has won a great victory as MP from Mandi Constituency

క్వీన్ గ్రాండ్ విక్టరీ..

ఇక కంగనా హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడైన విక్రమాదిత్య సింగ్‌ను చిత్తు చేసి.. కంగనా రాజకీయాల్లో అడుగుపెట్టి పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే గెలిచారు. తన విజయంపై హర్షం వ్యక్తం చేసిన కంగనా రనౌత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీదే తాను విజయం సాధించానని చెప్పారు. ఇక ఇదే క్రమంలో మీడియాతో మాట్లాడిన కంగన.. ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ లగేజీ సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. అయితే గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా విక్రమాదిత్య సింగ్.. కంగనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆమె ఈ విమర్శలు చేశారు. మండి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కంగనా రనౌత్ ఓడిపోవడం ఖాయమని.. రిజల్ట్ తర్వాత ఆమె సర్దుకుని ముంబైకి తిరిగి వెళ్లిపోతారని గతంలో విక్రమాదిత్య సింగ్ కంగనను ఎద్దేవా చేశారు. దీంతో తాజాగా ఆమె ఘన విజయం సాధించడంతో.. ఆ వ్యాఖ్యలను గుర్తు చేసిన కంగనా.. కౌంటర్‌ ఇచ్చారు.

- Advertisement -

బాలీవుడ్ ప్రముఖుల విక్టరీ…

ఇక బాలీవుడ్ లో కంగనా (Kangana Ranaut) మాత్రమే కాకుండా హేమ మాలిని, అరుణ్ గోవిల్, గోవిందా, నవనీత్ కౌర్, శత్రుఘ్న సిన్హా వంటి సెలెబ్రిటీలు కూడా పలు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇక కేరళ నుండి స్టార్ హీరో సురేష్ గోపి కూడా ఘన విజయం సాధించగా, రోజా వంటి పలువురు సినీ నేతలు కూడా పరాజయం పొందారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో చాలామంది సినీ ప్రముఖులు విజయం సాధించడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు