Kangana Ranaut : ఆగిపోయిన ఎమర్జెన్సీ మూవీ…. ఇప్పుడు అసలు సమస్య కంగననే…?

Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీ ఎంపీ. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కంగనా ఘన విజయం సాధించారు. ఒకవైపు ఆమె గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులు, మరోవైపు ఆమె నెక్స్ట్ మూవీ గురించి చర్చలు మొదలు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే కంగనా నటించిన ఎమర్జెన్సీ మూవీ ఆగిపోనుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు మూవీకి కంగనానే అసలు సమస్య కానుంది.

ఎమర్జెన్సీ మళ్లీ వాయిదా ?

1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. దీని ఆధారంగానే కంగనా కథ రాసుకుని ఎమర్జెన్సీ అనే సినిమా చేసింది. ఈ చిత్రాన్ని 2023లోనే విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా పడబోతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

కంగనానే అసలు సమస్య

ఈ ఎన్నికల్లో గెలిస్తే సినీ పరిశ్రమకు దూరంగా ఉంటానని ప్రచారం సందర్భంగా కంగనా డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే గెలిచింది కూడా. మరి ఇప్పుడు కంగనా సినిమా ఇండస్ట్రీని వదిలేస్తుందా లేదా అన్నదే ప్రశ్న. దీనిపై కంగనానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కంగనా నటించి దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె సినిమాలలో నటిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఇప్పటికే నటించి విడుదలకు రెడీగా ఉన్న ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అవుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పుడు కంగనా ఎంపీ కావడమే సమస్యగా మారబోతోంది.

- Advertisement -

Kangana Ranaut as Indira in 'Emergency'. 'What a resemblance' say fans |  Entertainment News | Onmanorama

కంగనా రనౌత్ బీజేపీ సిద్ధాంతాలతో ప్రభావితమైంది. కాంగ్రెస్ చూసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ పాత్రలో తాను నటిస్తానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా ప్రకటించినప్పటికి ఆమె ఇంకా బీజేపీలో చేరలేదు. కానీ ఇప్పుడు కంగనా బీజేపీ ఎంపీ. మరి ఈ సినిమాని కాంగ్రెస్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి.

కాంగ్రెస్ మరో అడ్డంకి

‘ఎమర్జెన్సీ’ సినిమాలో ఇందిరాగాంధీ పాత్ర ఎలా ఉంటుందో ఇంకా క్లారిటీ లేదు. ఒక్కసారి ఇందిరాగాంధీని చెడ్డదానిలా చూపించే ప్రయత్నం జరిగితే కంగనాపై కాంగ్రెస్ జనాలు మండిపడతారు. సినిమాపై నిషేధం విధించాలని ఒత్తిడి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాదు ఇప్పుడు కంగనా బీజేపీ మనిషి కాబట్టి విమర్శలు తట్టుకోలేని విధంగా ఉంటాయి. మరి ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

రిలీజ్ కాకుండానే ఇన్ని సమస్యలు

‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తానని కంగనా గతేడాది చెప్పింది. అయితే ఆమె చాలా కాలంగా ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు జరగనుంది. ఇన్ని కారణాల వల్ల ఈ సినిమా 9 రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు. దీంతో సినిమా విడుదల తేదీ మళ్లీ వాయిదా పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు