Kangana Ranaut: చెంప దెబ్బ పై అసలు విషయాన్ని చెప్పేసిన కంగనా రనౌత్..!

Kangana Ranaut.. బాలీవుడ్ లేడీ క్వీన్ కంగనా రనౌత్ గురించీ పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సినిమాలలోనే కాదు నిజజీవితంలో కూడా రాణి అని నిరూపించుకుంది.. తాజా గా హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థి పై భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. బిజెపి ఎంపీ కంగనాపై ఇప్పుడు పబ్లిక్ ఫోకస్ మరింత ఎక్కువైందనే చెప్పాలి.. ఇలాంటి సమయంలో చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా కానిస్టేబుల్ కంగనా పై చెంప దెబ్బ కొట్టడం ఇప్పుడు సంచలనం అయింది.

కంగనాను కొట్టిన లేడీ కానిస్టేబుల్..

Kangana Ranaut: Kangana Ranaut told the real thing about the cheek slap..!
Kangana Ranaut: Kangana Ranaut told the real thing about the cheek slap..!

అంతేకాదు ఈ విషయాన్ని పలువురు ఎక్స్ ద్వారా షేర్ చేస్తూ సంచలనం సృష్టించారు. అయితే కానిస్టేబుల్ ఇలా చెంప దెబ్బ వెనుక రాజకీయం ఏమిటి? అన్నది ప్రజల సందేహం.. దీనిపై కంగనా ఇంతకుముందే వివరించింది.. తాను రైతులపై చేసిన కామెంటే.. ఈ చెంప దెబ్బకు కారణం అని కూడా ఆమె వ్యాఖ్యానించింది.అసలు ఏమి జరిగింది అనే విషయానికి వస్తే.. ఇంతకుముందు బీజేపీ ప్రభుత్వం వ్యవసాయంపై సీఏఏ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. దీనిని వ్యతిరేకిస్తూ సిక్కు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేశారు.. అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిలో తీవ్రవాదులు ఉన్నారని… తీవ్రవాదులు రైతులుగా చలామణి అవుతున్నారని కంగనా కామెంట్ చేసింది.. ఇక వ్యవసాయ బిల్లును వ్యతిరేకించేది ఈ తీవ్రవాదులేనంటూ కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పాటు కంగనా తాను తీవ్రవాదులు అనలేదని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది.. దీనితో కంగనా వ్యాఖ్యలు సిక్కుల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి.. దాని పర్యావసానమే ఈ చెంప దెబ్బ రూపంలో బయటపడింది..

కంగనా వ్యాఖ్యలకు హార్ట్ అయిన సిక్కు రైతులు..

అయితే ఈ చెంప దెబ్బ ఘటన తర్వాత కంగనా మరొకసారి తీవ్రవాదాన్ని ప్రస్తావించడం ఆశ్చర్యకరం బిజెపి నాయకురాలు , నటి కంగనా రనౌత్ ను చంప దెబ్బ కొట్టిన సి ఐ ఎస్ ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఇలా తెలిపారు.. వంద రూపాయల కోసం రైతులు అక్కడ కూర్చున్నారని కంగనా స్టేట్మెంట్ ఇచ్చింది. డబ్బు కోసం తాము వెళ్లి అక్కడ కూర్చుంటామా.. ఆమె ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేసింది.. అందుకే కొట్టాను అంటూ తెలిపింది ఆ మహిళా కానిస్టేబుల్…

- Advertisement -

అసలు విషయం చెప్పిన కంగనా..

ఇక కంగనా ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ నోటు లో పంజాబ్లో తీవ్రవాదం హింస దిగ్భ్రాంతి కరంగా పెరిగాయని కూడా వ్యాఖ్యానించారు.. ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నానని అయితే పంజాబ్లో పెరుగుతున్న ఉగ్రవాదం గురించి ఆందోళన చెందుతున్నాను అని కూడా తెలిపింది కంగనా.. ఇక కానిస్టేబుల్ నా ముఖం మీద కొట్టి నన్ను దుర్భాషలాడడం ప్రారంభించింది.. ఆమె అలా ఎందుకు చేసిందో అడిగాను.. రైతుల నిరసనలకు తాను మద్దతు ఇస్తున్నందువల్లే కొట్టాను అంటూ చెప్పిందని కంగనా చెప్పుకొచ్చింది.. మొత్తానికైతే కంగనా చేసిన తప్పుకు మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ రూపంలో క్లారిటీ ఇచ్చింది.. అయితే ఈ విషయంపై కంగనా మరొకసారి స్పందించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు