Kangana Ranaut : కంగనా గెలుపుపై ఒకే ఒక్క సెలబ్రిటీ హ్యాపీ… ఎవరో తెలుసా?

Kangana Ranaut : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈసారి చాలా షాకింగ్ ఫలితాలు వచ్చాయి. బడా నాయకులు అనుకున్న వాళ్ళు చాలా చోట్ల ఓడిపోయారు. అయితే ఈసారి బాలీవుడ్, భోజ్‌పురి, సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఎన్నికల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు సెలబ్రిటీలు సక్సెస్‌ కూడా సాధించారు. అయితే కంగనా గెలుపుపై ఒకే ఒక్క సెలబ్రిటీ హ్యాపీ… ఎవరో తెలుసా?

కంగనా గెలుపుపై బాలీవుడ్ మౌనం

పవన్ కళ్యాణ్ గెలవాలని సౌత్ ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విజయం సాధించినందుకు బాలీవుడ్‌లో ఒక్కరు మాత్రమే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కంగనా రనౌత్ విజయంతో బాలీవుడ్ పరిశ్రమ సంతోషించలేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

పవన్ కళ్యాణ్ కు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌సిపికి చెందిన వంగా గీతాపై పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. 70 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో ఆయన సులభంగా గెలిచారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై ​​పలువురు సౌత్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, ధరమ్ తేజ్, అడివి శేష్, నితిన్, వరుణ్ తేజ, నాని వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Anupam Kher Congratulates Kangana Ranaut For Winning Lok Sabha Elections; 'Kuch Bhi Ho Sakta Hai Agar..' - Culture

కంగనా గెలుపుపై ఒకే ఒక్క సెలబ్రిటీ హ్యాపీ

నటి కంగనా రనౌత్‌కు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటిదాకా ఒక్క బాలీవుడ్ స్టార్ కూడా ఆమెకు అభినందనలు తెలపలేదు. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ తరపున పోటీ చేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై ఆమె 74,755 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటి కంగనా రనౌత్‌ను అభినందిస్తూ ప్రియమైన కంగనా, అద్భుతమైన విజయానికి అభినందనలు. మీరు రాక్‌స్టార్ మీ ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకం. హిమాచల్ ప్రదేశ్, మండి ప్రజలు మీ పట్ల సంతోషంగా ఉన్నారు. కష్టపడితే ఏదైనా సాధ్యమని నిరూపించారు’ అంటూ ఆమె గెలుపుపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇదే కారణమా?

అయితే బాలీవుడ్ నుండి కంగనాకు అభినందనలు రాకపోవడానికి కారణం ఆమె పరిశ్రమ వ్యతిరేక టాక్ వల్ల కావచ్చు. పరిశ్రమలో నెపోటిజంపై కంగనా తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంది. ఆమె చాలా మంది నటులను టార్గెట్ చేసి మాట్లాడింది. దీంతో ఒకానొక సమయంలో ఆమెను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించారు కూడా. ఏదేమైనా కంగనా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినా బి-టౌన్‌లో ఎలాంటి తేడా కనిపించలేదు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన స్టార్స్

2024 లోక్‌సభ ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు విజయం సాధించారు. బాలీవుడ్ నటి హేమమాలిని, నటులు శత్రుఘ్న సిన్హా, అరుణ్ గోవిల్, కంగనా రనౌత్ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్, సురేష్ గోపి సౌత్ ఇండస్ట్రీ నుండి ఈసారి ఎన్నికల్లో విజయభేరి మోగించారు. భోజ్‌పురి పరిశ్రమకు చెందిన మనోజ్ తివారీ, రవి కిషన్ కూడా ఎన్నికల్లో సక్సెస్ సాధించి, అదరగొట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు