Kangana Ranaut : జక్కన్న పై ప్రశంసలు

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకుంటున్న ఆర్ఆర్ఆర్, హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి అవార్డులను కైవసం చేసుకుంటుంది. ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023 గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు వచ్చింది.

చంద్ర బోస్ లిరిక్స్ అందించిన ఈ పాటకి ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. యువ సింగర్లు రాహుల్ సిప్లిగంజ్ – కాలభైరవలు గాత్రం అందించారు. ఈ పాటలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ నాటు స్టెప్పులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై స్పందించింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.

ఈ సందర్భంగా రాజమౌళి పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించింది. ఈ అవార్డుల వేడుకలలో రాజమౌళి భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఫైర్ బ్రాండ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “మీ సినిమాలతో భారతీయ సినిమాని ఇంటర్నేషనల్ ఫ్లాట్ ఫార్మ్ పై నిలబెట్టడం ఒక గొప్ప విషయం అయితే.. మరొకటి మీ వస్త్రధారణ. ధోతి లో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి అంతర్జాతీయ వేదికపై ఉంటారనుకోలేదు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతి అంతర్జాతీయ వేడుకల్లో మీరు దోతిలో వెళ్లడం చూస్తుంటే మీకు దేశ ధర్మం పై ఎంతటి ప్రేమ ఉందో అర్థం అవుతుంది. భారతీయ ధర్మంపై మీరు చూపించే ప్రేమ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

- Advertisement -

కాగా ఈ బాలీవుడ్ ప్రస్తుతం చంద్రముఖి 2, ఎమర్జెన్సీ చిత్రాలలో నటిస్తోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు