Kangana Ranaut: హీరోయిన్ కు హత్య చేస్తామని బెదిరింపు కాల్స్

Kangana Ranaut: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో కంగనా రనౌత్ ఒకరు. కేవలం నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంది కంగనా. ఇక రీసెంట్ టైమ్స్ లో కంగనా చేస్తున్న సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు కానీ ఒకప్పుడు కంగనా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కంగనా లాంటి యాక్టర్స్ తో సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) లాంటి సంచలన దర్శకులు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పాలి. ఇక తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ ఏక్ నిరంజన్ సినిమాలో కంగనాను హీరోయిన్ పెట్టుకున్నారు.

వేదం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) బాలీవుడ్ లో కంగనా హీరోయిన్ గా మణికర్ణిక (Manikarnika) అనే సినిమాను చేశారు. అయితే ఆ సినిమా నుండి కొద్దిపాటి వివాదం వలన దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమాను తనే దర్శకురాలుగా పూర్తి చేసింది కంగనా, బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇక జయలలిత బయోపిక్ గా వచ్చిన తలైవి(Thalaivi) సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు.

ఇక ప్రస్తుతం భారతీయ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం అంశం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమాకు స్వయంగా కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు కొద్దిపాటి వివాదాలు రావడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ 14వ తారీఖున రిలీజ్ అయింది. ఈ సినిమాలో తమ వర్గాన్ని తప్పుగా చూపించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక కమిటీ వెల్లడించింది. అలానే కంగనాకు నోటీసులు కూడా పంపించింది.

- Advertisement -

Kangana Ranaut

“ఈ నెల 14న విడుదలైన ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించాలి. మా కమ్యూనిటీకి మేకర్స్ లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి” అని ఎసీపీసీ నోటీసులో తెలిపింది. ఈ సినిమా విషయంలో కంగన హత్య బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్స్ కు ఆమె రిక్వెస్ట్ చేశారు. ఈ సినిమా సెప్టెంబరు 6న విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు