Kangana Ranaut : కంగనాను కొట్టిన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అమ్మాయికి బాలీవుడ్ లో ఛాన్స్

Kangana Ranaut : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన కంగనా సంతోషం ముచ్చటగా మూడు రోజులు కూడా గడవక ముందే నీరు గారింది. ఊహించని విధంగా ఎయిర్ పోర్ట్ లో ఓ సెక్యూరిటీ అధికారిని కంగనా చెంప పగలగొట్టడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ అమ్మాయికి ఉద్యోగం పోతే జాబ్ ఇవ్వడానికి రెడీ అంటూ ఓ బాలీవుడ్ ప్రముఖుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

చెంప పగలగొట్టిన సెక్యూరిటీ గార్డుకు బాలీవుడ్ ఆఫర్

చండీగఢ్ విమానాశ్రయంలో నటి, ఎంపీ కంగనా రనౌత్‌ను సెక్యూరిటీ గార్డు చెంప పగలగొట్టిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు సెలబ్రిటీలు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. అయితే కంగనాకు బాలీవుడ్‌లో చాలా మంది నుంచి వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కంగనా చెంపపై కొట్టిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా ఉద్యోగి కుల్విందర్ కౌర్ తరపున కొందరు మాట్లాడుతున్నారు. సింగర్ విశాల్ దద్లానీ కుల్విందర్ కౌర్‌కు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

సింగర్ విశాల్ షాకింగ్ నిర్ణయం

సింగర్ విశాల్ దద్లానీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘నేను హింసను ఎప్పటికీ సమర్థించను. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లోని మహిళా సిబ్బంది ఆగ్రహం ఏమిటో నాకు బాగా అర్థమైంది. కుల్విందర్ కౌర్‌పై CISF ఏదైనా చర్య తీసుకుంటే, ఆమెకు ఉద్యోగం వచ్చేలా చూస్తాను. జై హింద్, జై జవాన్, కై కిసాన్’ అని విశాల్ దద్లానీ రాశారు.

- Advertisement -

kangana ranaut: Kangana Ranaut controversy: Vishal Dadlani offers job to  CISF woman who slapped the actress - The Economic Times

స్కానింగ్ కోసం కంగనా ఫోన్ ఇవ్వమని అడిగారు. అయితే ఇప్పుడు ఎంపీ అయినందున ఫోన్ ఇవ్వడానికి నిరాకరించింది. అక్కడి నుంచి వాదన మొదలైంది. కుల్విందర్ కౌర్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తే, దయచేసి ఆమెను నా దగ్గరకి తీసుకురండి. ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని విశాల్ దద్లానీ హామీ ఇచ్చారు.

బాలీవుడ్ కు కంగనా చురకలు

గురువారం (జూన్ 6) చండీగఢ్ విమానాశ్రయంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకోగా ఆ తర్వాత కంగనా రనౌత్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘హలో ఫ్రెండ్స్. శ్రేయోభిలాషులు, మీడియా నుండి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు క్షేమంగా ఉన్నాను. చండీగఢ్ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ చెక్ తర్వాత, నేను ముందుకు వెళుతుండగా పక్కనే ఉన్న క్యాబిన్‌లోని సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ గార్డు వచ్చి నా ముఖం మీద చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడింది. ఇలా ఎందుకు చేశావని అడిగాను. రైతుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పింది. కానీ పంజాబ్‌లో పెరుగుతున్న తీవ్రవాదం, ఆందోళనను మనం ఎలా ఎదుర్కొంటాము అనేదే నా టెన్షన్. ధన్యవాదాలు’ అని కంగనా వీడియో ద్వారా తెలిపింది.

ఆ తరువాత ఈ ఘటనపై స్పందించనందుకు బాలీవుడ్ ప్రముఖులకు చురకలు అంటించింది. ఈ ఘటనపై మౌనంగా ఉన్నారు అంటే సంబరాలు చేసుకుంటున్నారా ? అని సూటిగా ప్రశ్నించడంతో కొంతమంది సెలబ్రిటీలు కంగనాపై జరిగిన ఈ ఘటనను ఖండించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు