Kangana Ranaut: కంగనాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి…. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ బ్యూటీ ప్లాన్ ఏంటో…?

Kangana Ranaut: బాలీవుడ్‌ హీరోయిన్‌, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి పేరును సంపాదించుకుంది. కంగనా (Kangana Ranaut) నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ (Emergency ). ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇందిరా గాంధీగా కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన విడుదల కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.

ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ లో కంగనా తన నట విశ్వరూపం చూపించింది. ఇక ఇప్పటివరకు కంగనా నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. విశేషమేమిటంటే ఎమర్జెన్సీ సినిమాని కంగనానే డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.

అయితే నటి కంగనా రణౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సినిమా వివాదంలో చిక్కుకుంది. తమ వర్గం గురించి తప్పుగా సినిమా తీశారని శిరోమణి గురుద్వార ప్రబంధన్ కమిటీ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఎంపీ కంగనాతో పాటు పలువురికి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆగస్టు 14వ తేదీన విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని, మా కమ్యూనిటీకి మేకర్స్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

- Advertisement -

అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM revanth reddy) న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు సినిమాను నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సిక్కులకు హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం సర్కారు సలహాదారు షబ్బీర్ ఆలీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఈ ఇష్యూను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మరి దీనిపై రేవంత్‌ రెడ్డి ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు