Kanguva: ఎన్ని ప్రయత్నాలు చేసినా బాహుబలి ను బీట్ చేయలేరు

Kanguva: సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ను మొదలుపెట్టి సౌర్యం సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శివ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ హీరోగా శంఖం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత సిరితై అనే సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో రవితేజ హీరోగా దరువు అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు శివ.

తమిళ్ లో వరుస హిట్లు

ఇకపోతే తమిళ్లో అజిత్ హీరోగా వీరం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శివ కెరీర్ కి తిరుగులేకుండా పోయింది. ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. డాలి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత శివ చేసిన వేదాళం సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను బోలా శంకర్ పేరుతో చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా ఇక్కడ డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వివేగం, విశ్వాసం సినిమాలు కూడా అక్కడ బాగానే ఆడాయి. ఇక ప్రస్తుతం సూర్య హీరోగా కంగువ అనే సినిమాను చేస్తున్నాడు శివ.

Suriya's 'Kanguva'

- Advertisement -

పాన్ ఇండియా రేంజ్ లో రానున్న కంగువ

హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి అభిమానులు సూర్యకు ఉన్నారు. సూర్య చేసిన ఎన్నో సినిమాలను ఆదరించారు. ఇప్పుడు సూర్య చేస్తున్న కంగువ సినిమా గురించి కూడా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.

బాహుబలి రేంజ్ లో

తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి సినిమా స్థాయి ఏంటో స్థానం ఏంటో ప్రపంచవ్యాప్తంగా చూశారు. బాహుబలిని కొట్టే సినిమా కోసం మిగతా ఇండస్ట్రీలు ప్రయత్నిస్తున్న కూడా అది జరగలేదు. అయితే బాహుబలి సినిమా రేంజ్ లో కంగువ సినిమా ఉండబోతుంది అని కొంతమంది నమ్మకం. అలానే రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి పదివేల మందితో ఒక ఫైట్ ను డిజైన్ చేశారట. ఈ సినిమాలో బాబీ డియల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా అనిమల్ సినిమాలో కనిపించిన బాబి విలనిజానికి విశ్వరూపాన్ని చూపాడు. ఇక ఈ సినిమాలో అంతకుమించి ఉండబోతుందని. ఈ సినిమా బాహుబలి రేంజ్ కి వెళ్తుందని కొంతమంది తమిళ్ తంబీలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు