KEGnanavel Raja : తెలుగువాళ్ళు తమిళ హీరోల్ని తమ వాళ్లలా చూసుకుంటారు.. మరి మన హీరోలని అరవోళ్లు?

KEGnanavel Raja : తెలుగు సినిమా గత పదేళ్లలో జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి సైతం ఎదిగిన సంగతి తెలిసిందే. దానికి అందరి కంటే మొదట కారణం తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానమే అని చెప్పాలి. అయితే తెలుగు మూవీ లవర్స్ గొప్పదనం గురించి చెప్పాలంటే.. ఒక్క తెలుగు సినిమాయే కాదు, కంటెంట్ బాగుంటే ఏ భాషకి చెందిన సినిమా అయినా, తెలుగులో విడుదలయితే, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ముఖ్యంగా తమిళ్ హీరోల సినిమాలనయితే తెలుగు హీరోలకు ధీటుగా వారి సినిమాలను ఆదరిస్తారు. అప్పట్లో చంద్రముఖి, అపరిచితుడు, రోబో, రీసెంట్ గా విక్రమ్, లియో వంటి సినిమాలను తెలుగు సినిమాల రేంజ్ లో ఇక్కడ ఆడియన్స్ ఆదరించారు. అయితే ఈ విషయంపై లేటెస్ట్ గా తమిళ్ అగ్ర నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా ఓ ఇంటర్వ్యూ లో ప్రస్తావించడం జరిగింది.

తెలుగు ప్రేక్షకుల గొప్పదనం అది – జ్ఞానవేల్ రాజా..

తమిళ అగ్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా (KEGnanavel Raja) గురించి పెద్దగా ఇక్కడి ఆడియన్స్ కి తేలికపోవచ్చు. త్వరలో రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాలు కంగువ, తంగ‌లాన్ చిత్రాలు నిర్మించింది ఆయనే. అయితే తాజాగా జ్ఞాన‌వేల్ రాజా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జ్ఞానవేల్ రాజా తెలుగు సినీ ప్రియుల గొప్పదనం గురించి మాట్లాడారు. తమిళ సినీ ప్రేక్ష‌కులు, లేదా మీడియావాళ్లు గాని తెలుగుహీరోల‌ను హీరోలు లాగానే చూస్తారు. కానీ తెలుగు ప్రేక్ష‌కులు మాత్రం త‌మిళ హీరోలను మాత్రం తమ హీరోలుగా చూస్తారని అదే వాళ్ళ గొప్పదనం అని చెప్పుకొచ్చారు. ర‌జినీ కాంత్, క‌మ‌ల్ హాస‌న్, సూర్య‌, కార్తీ, విక్ర‌మ్, విజ‌య్, అజిత్, విజ‌య్ సేతుప‌తి వంటి హీరోలంద‌ర‌ని తెలుగు ఆడియన్స్ ‘మ‌న హీరోలు’ అని ఓన్ చేసుకుంటారు. అది మనకు చాలా న‌చ్చుతుంది. అందుకే తెలుగు ప్రేక్ష‌కుల‌కు మిగ‌తా సౌత్ ప్రేక్ష‌కులకు చాలా తేడా ఉందని జ్ఞానవేల్ రాజా చెప్పుకొచ్చాడు.

Kanguva Producer KEGnanavel Raja Intresting Comments On Telugu Audiance

- Advertisement -

మరి తెలుగు హీరోలని అరవోళ్లు ఆదరించేదెప్పుడు?

అయితే నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది తెలుగు నెటిజన్లు ఆ నిర్మాతకి ధన్యవాదాలు చెప్తూనే సెటైర్లు వేస్తున్నారు. తమిళ ఆడియన్స్ ని తెలుగు వారు ఇంతగా ఆదరిస్తున్నారు. మరి తెలుగు స్టార్ హీరోల సినిమాలని తమిళ ప్రేక్షకులు ఎందుకు అంత పట్టించుకోరు అని తెలుగు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదో బాహుబలి, RRR లాంటి పెద్ద సినిమాలను తప్ప చిన్న సినిమాలని, మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలని అక్కడ ఆడియన్స్ అస్సలు పట్టించుకోరని, ఎందుకు తెలుగు హీరోలంటే అంత చిన్న చూపని తెలుగు మూవీ లవర్స్ విమర్శిస్తున్నారు. మరి దీనికి తమిళ మూవీ మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో. ఇదిలా ఉండగా జ్ఞానవేల్ రాజా నిర్మించిన కంగువను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు