Kannada Pavitra: ఈ ముగ్గురు పవిత్రలకు బ్యాచిలర్స్ దొరకలేదా..?

Kannada Pavitra.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఎఫైర్స్, ప్రేమ, పెళ్లిళ్ల వ్యవహారం గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది ప్రేమించుకొని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని కారణాలు చేత విడిపోతూ ఉండగా.. మరి కొంతమంది ఎఫైర్స్ పెట్టుకొని.. ఆ తర్వాత సఖ్యత లేకపోవడం వల్ల కూడా విడిపోతూ ఉన్నారు. అలా గడిచిన కొన్నేళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పవిత్ర లోకేష్.. ముఖ్యంగా వీకే నరేష్ తో కలిసి నాలుగవ వివాహ వ్యవహారం ఈమె పేరును వైరల్ గా చేసింది. సినీ ఇండస్ట్రీ తో పాటు కన్నడ సినీ ఇండస్ట్రీలో మారు మ్రోగేలా చేసింది. ముఖ్యంగా ఎఫైర్స్ తోనే ఈమె వార్తల్లో నిలిచింది ఇప్పటికీ కూడా ఈమధ్య అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసారంటే అవే వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.. గతంలో హీరోయిన్ గా కూడా పవిత్ర లోకేష్ కన్నడ సినిమాలలో నటించింది.

ఒక ఘటన మరువక ముందే ఇంకొక ఘటన..

Kannada Pavitra: Can't find bachelors for these three saints..?
Kannada Pavitra: Can’t find bachelors for these three saints..?

అయితే ఈ ఘటన మర్చిపోయే సమయంలో ఒక్కసారిగా నటి త్రినయని (పవిత్ర) పేరు మరింత పాపులారిటీ సంపాదించింది..మరోవైపు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన పవిత్ర జయరాం కూడా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చారు. అయితే నటుడు చందు కూడా వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తితో ప్రేమలో పడి యాక్సిడెంట్ లో ఇటీవలే కన్నుమూసిన సంగతి కూడా తెలిసిందే. ఆమె గురించి ప్రస్తుతం ఎలా మాట్లాడుకున్నప్పటికి చందు జీవితం ఆమె వల్లే నాశనం అయ్యిందని కూడా చెప్పవచ్చు.

ప్రియురాలి కోసం ఏకంగా హంతకుడిగా మారిన హీరో..

ఇప్పుడు తాజాగా మరొక హీరో.. హీరోయిన్ కోసం చేసిన పనికి ఏకంగా హీరో జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఎవరో కాదు హీరో దర్శన్.. నటి పవిత్ర గౌడ తో ప్రేమలో పడి పదేళ్లుగా పెళ్లి చేసుకోకుండానే రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శన్ కు ఇప్పటికే వివాహమై కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నటి పవిత్రను ఎవరో ఏదో అన్నారని తెలుసుకున్న దర్శన్.. ఏకంగా ఒకరిని హత మార్చే విషయంలో తన హస్తం ఉందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ముగ్గురు పవిత్ర లకు బ్యాచిలర్స్ దొరకలేదా..

ఇలా చాలామంది సెలబ్రిటీలు సైతం వివాహమైన వారితోనే ఎఫైర్లు మెయింటైన్ చేస్తూ కన్నడ సినీ పరిశ్రమనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమను కూడా పాపులర్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే వీరి పేర్లు సైతం తెలియని వారంటూ ఎవరూ లేరు అనేలా మారిపోయింది. పైగా ఈ ముగ్గురు పవిత్రలకు బ్యాచిలర్స్ దొరకడం లేదేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా ఇలా ముగ్గురు పవిత్రలే పైగా ముగ్గురు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వారే.. పైగా ముగ్గురు పెళ్లి అయిన వారితోనే ఎఫైర్ పెట్టుకోవడం ఏదో అంతా కోయిన్స్ డెన్స్ గానే జరిగిపోయింది. ఏదేమైనా ఇప్పుడు వీరి ముగ్గురు ఇలా వార్తల్లో నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. మరి ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఎలా వార్తల్లో నిలుస్తారో చెప్పడం అసాధ్యం. ఇకపోతే ఆ ఇద్దరి కథ పక్కన పెడితే.. ఇప్పుడు దర్శన్, పవిత్రల కథ ఏ మలుపు తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు