Coolie : తలైవా సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ సూపర్ స్టార్..

Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ – స్టైలిష్ మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) కాంబోలో “కూలీ” అనే సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. పక్కా ‘లోకి’ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విక్రమ్ తర్వాత లోకేష్ కానగరాజ్ కు కూడా పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెరిగింది. వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందనగానే ఈ సినిమాపై సాలిడ్ క్రేజ్ పెరిగింది. ఇక రీసెంట్ గా రజినీకాంత్ (Rajinikanth) ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయగా, అభిమానులకు వింటేజ్ లుక్ ను రజినీకాంత్ ను గుర్తు చేశారు. ఇక కూలీ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ సాలిడ్ క్రేజ్ నెలకొని ఉండగా, తాజాగా కూలీ సినిమా నుండి ఊరమాస్ అప్డేట్ వచ్చింది.

Kannada star Upendra enter in Rajinikanth's Coolie movie

కూలీ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ సూపర్ స్టార్..

రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో భారీ తారాగణం నటిస్తుండగా, తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) కూడా ఎంట్రీ ఇచ్చినట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు. తాజాగా ఉపేంద్ర సెట్స్ లో రజినీకాంత్ తో ఉన్న స్టిల్ ని షేర్ చేస్తూ, మేకర్స్ ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. అయితే ఉపేంద్ర రోల్ ఎలాంటిది అన్న దానిపై క్లారిటీ లేదు, కానీ పక్కా మాస్ రోల్ లో బలమైన పాత్ర అయి ఉంటుందని చెప్పొచ్చు. తాజాగా ఉపేంద్ర పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ సగానికి పైగా పూర్తవగా, ఓ వైపు రజిని వేట్టైయన్ షూటింగ్ లో పాల్గొంటూనే కూలీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు.

- Advertisement -

స్మగ్లింగ్ నేపథ్యంలో కూలీ…

ఇక ఈ కూలీ (Coolie) సినిమా కూడా లోకి ఇతర సినిమాల తరహాలో స్మగ్లింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతోందని తెలుస్తూనే ఉంది. ఆమధ్య రిలీజ్ చేసిన కూలీ టీజర్ ద్వారా ఈ సినిమా స్టోరీ బంగారం స్మగ్లర్ల ముఠా కి సంబంధించిన నేపథ్యంతో కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇక టీజర్ లో బంగారం స్మగ్లింగ్ నే మెయిన్ గా చూపిస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకు కూడా లోకి యూనివర్స్ కి లింక్ చేసినా చేయొచ్చని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమాలో మైక్ మోహన్ విలన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్, రాఘవ లారెన్స్, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు