Kannappa: మంచు ఫ్యామిలీ తప్ప ఈ సినిమాకి అందరూ ప్లస్ అయ్యేటట్టే ఉన్నారు

Kannappa: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్ లో కన్నప్ప ఒకటి. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఈ సినిమా కథ కంటే కూడా ఈ సినిమాలో నటిస్తున్న చాలామంది స్టార్ కాస్ట్ మీద అలానే ఈ సినిమా దర్శకుడు మీద మంచి నమ్మకాలు ఉన్నాయి. వాస్తవానికి మాట్లాడుకుంటే మంచి ఫ్యామిలీ తీసిన సినిమాలు చూడటం జనాలు మానేసి చాలా రోజులైంది. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఫ్యామిలీ సినిమాలు తీస్తున్న కూడా మినిమం కలెక్షన్లు కూడా రావు.

ఇకపోతే కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మోహన్ బాబు ఈ సినిమాకి నిర్మాతకు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్(Akshaya Kumar) శివుని పాత్రలో కనిపించనున్నారు. అలానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రుద్ర అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సౌత్ ఇండియాలోని పెద్దపెద్ద నటులు అంతా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

Kannappa

- Advertisement -

ఇకపోతే విలన్ గా ఎన్నో సినిమాలు ద్వారా గుర్తింపు సాధించుకున్న ముఖేష్ ఋషి ఈ సినిమాలో కంపడు అనే పాత్రను చేస్తున్నాడు. పులిందులు.. అత్యంత పురాతనమైన జాతి, సదాశివ కొండల్లో నివసిస్తుంటారు. వంశపారపర్యంగా పవిత్రమైన వాయు లింగాన్ని సంరక్షిస్తున్న ఈ పులింద జాతిని భద్రగణం అంటారు. భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంపడు. అయితే దీనిని అధికారికంగా ప్రకటిస్తూ ముఖేష్ ఋషి బ్రహ్మాజీ ఉన్న ఒక పోస్టర్ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు