Kannappa Update : కన్నప్ప సెట్స్‌లోకి చందమామ… విష్ణు మూవీ మొత్తం స్టార్ యాక్టర్సే !

Kannappa Update : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాటు స్టార్ కాస్ట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, నయనతార, మధుబాల , బ్రహ్మానందం వంటి భారీ తారాగణం భాగస్వామ్యమైన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై స్పందిస్తూ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది..

ఆమె ఎవరో కాదు అందాల చందమామ కాజల్ అగర్వాల్.. తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేడుకగా తెలియజేస్తూ ఆమె ఒక మంచి పాత్రలో నటిస్తోంది అంటూ తెలిపింది. ఇప్పటికే కన్నప్ప సినిమా న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేయగా.. ఇప్పుడు హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక మే 14 నుంచి మే 25 వరకు ఫ్రాన్స్ లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా బృందం కూడా అక్కడ పాల్గొనబోతోంది. మే సాయంత్రం 6 గంటలకు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికలో కన్నప్ప టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Kannappa: Kajal's entry into the set.. they are the Star cast..!
Kannappa: Kajal’s entry into the set.. they are the Star cast..!

ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టీజర్ పైనే అందరి అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఆ టీజర్ ప్రేక్షకులను ఎంతలా ఆపట్టుకుంటుందో చూడాలి..

- Advertisement -

భారీ తారాగణం..

ఇకపోతే ఈ సినిమాలో అందరూ భారీ పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలే నటిస్తూ ఉండడం గమనార్హం .. ఇక అలాంటి వారిలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్, కౌశల్ మండ , రాహుల్ మాధవ్, దేవరాజ్, ఆర్పిత్ రంక , మధు బాల, ఐశ్వర్య భాస్కరన్, ప్రీతి ముకుందన్ , సురేఖ వాణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా వచ్చే చేరింది మొత్తానికైతే ఇంతమంది భారీ తారాగణం ఈ సినిమాలో భాగం కావడంతో అందరి అంచనాలు ఈ సినిమాపైనే ఉన్నాయి. మరి వీరంతా కూడా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటారో చూడాలి.

కాజల్ అగర్వాల్..

ఇక కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే.. తన బాల్య మిత్రుడు గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.. ఇక ఇటీవల సత్యభామ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈమె మరొకవైపు కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ టు సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం కన్నప్ప సినిమా షూటింగ్లో జాయిన్ అయింది..ఈ సినిమా తర్వాత మరి ఎటువంటి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి .

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు