Kannappa: విస్కీ తాగడానికి పిలిచి స్క్రిప్ట్ లాక్కున్న మోహన్ బాబు

Kannappa: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతున్నాయో మన అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక భారీ బడ్జెట్ సినిమా వస్తుంది అని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ లాంటి దర్శకులు తెలుగు సినిమాను ఎల్లలు దాటించారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అందులో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప అనే సినిమాలో కూడా ప్రభాస్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

Kannappa

విష్ణు కూడా నా కొడుకు లాంటి వాడే

మంచు ఫ్యామిలీ అంతా కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. కన్నప్ప పాత్రను ఈ సినిమాలో మంచు విష్ణు పోషిస్తున్నాడు. అయితే భక్తకన్నప్ప అనే సినిమాను చాలా రోజుల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు చేశారు. అయితే ఇప్పుడు మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమాను మొదలుపెట్టడానికంటే ముందు మోహన్ బాబు కృష్ణంరాజుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచారట. దానికి జవాబుగా కృష్ణంరాజు ఇంటికి ఎందుకు అని అడిగారట. ఊరికే విస్కీ తాగడానికి రండి అని అన్నారట. విస్కీ తాగడానికి అయితే వస్తాను. మీరు కన్నప్ప సినిమాను చేస్తున్నారు కదా దానిని నేను ప్రభాస్ తో చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు మంచు విష్ణు తో చేస్తున్నారు. అయినా కూడా పరవాలేదు విష్ణు కూడా నా కొడుకు లాంటి వాడే అంటూ రెబల్ స్టార్ కృష్ణంరాజు చెప్పుకొచ్చారట.

- Advertisement -

ఏదేమైనా కృష్ణంరాజు మాట్లాడిన తీరు అద్భుతం అని చెప్పాలి. ఒకవేళ కృష్ణంరాజు ఈ ప్రాజెక్టు గురించి ఒప్పుకోకపోతే విస్కీ పోసి ఇప్పించాలని మోహన్ బాబు ఏమైనా ప్లాన్ చేశారేమో అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ మాత్రం సినిమా పైన అంచనాలను పెంచింది. ఈ సినిమా టీజర్ లో కూడా కేవలం ప్రభాస్ కళ్ళను మాత్రమే చూపించారు. అయితే ఈ ఒక్క షాట్ కూడా ఆడియన్స్ వేరే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు