Kantara Chapter 1: రిషబ్ శెట్టి భారీ ప్లాన్.. రంగంలోకి హాలీవుడ్ బ్యాచ్.. !

Kantara Chapter 1.. ఎటువంటి అంచనాలు లేకుండా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమా విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో హీరోగా నటించిన కాదు ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.. ఈయన నటనతో అందరిని ఆకట్టుకున్నారు..అద్భుతమైన విజువల్స్ తో ప్రత్యేకించి క్లైమాక్స్ చూసే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు. కేవలం రూ.16 కోట్ల పెట్టుబడి తో ఈ సినిమాను తెరకెక్కించి రూ .350 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించారు. హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కాంతారా చాప్టర్-1 కోసం హాలీవుడ్ బ్యాచ్..

Kantara Chapter 1: Rishabh Shetty's big plan.. Hollywood batch enters the field.. !
Kantara Chapter 1: Rishabh Shetty’s big plan.. Hollywood batch enters the field.. !

ఇప్పుడు తాజాగా కాంతారా చాప్టర్-1 కోసం సరికొత్తగా ప్రయోగాత్మకంగా హాలీవుడ్ బ్యాచ్ ని రిషబ్ శెట్టి దింపబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలోని విఎఫ్ఎక్స్ క్వాలిటీ , సౌండ్ డిజైన్, కెమెరా పనితనం కూడా బాగుండాలని.. అందుకే వీటన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని విడుదల చేసేలా ముందుగానే ప్లాన్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. అందుకే కాంతారా చాప్టర్-1 భాగాన్ని హాలీవుడ్ సంస్థలతో కలిపి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాంతార చిత్రంలో మేకప్ సెట్టింగ్ కలర్ గ్రేడింగ్ వంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా రిషబ్ శెట్టి భారీ గా జాగ్రత్త లు తీసుకుంటున్నట్లు సమాచారం.

బిఎఫ్ మూవింగ్ పిక్చర్స్ సంస్థతో కలయిక..

ప్రముఖ హాలీవుడ్ కి చెందిన ఎక్స్పర్ట్స్ లో ఒకరైన ఏజెన్సీ తో అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా రిషబ్ శెట్టి తెలుస్తోంది. క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ఆస్కార్ విజేత ది లయన్ కింగ్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించిన బిఎఫ్ మూవింగ్ పిక్చర్స్ సంస్థతో కాంతారా ప్రీక్వెల్ కు విఎఫ్ఎక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సంస్థ.. హాలీవుడ్ లోనే అత్యుత్తమ స్థానాలలో ఒకటిగా పేరు సంపాదించింది.. ముఖ్యంగా హ్యారీ పోటర్, బ్యాట్ మాన్ ఇతరత్రా వంటి చిత్రాలకు కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. కాంతారా సినిమా కంటే కాంతారా చాప్టర్-1 వందేళ్ళ క్రితం నాటి కథాంశం తో రాబోతున్నది.

- Advertisement -

విఎఫ్ఎక్స్ కోసం భారీ ప్లాన్..

ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ వాడకం కూడా చాలా ఎక్కువగా ఉండడంతో బెస్ట్ క్వాలిటీ కోసం ఇలా హాలీవుడ్ సంస్థలను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కాంతార సినిమాకు పెట్టుబడి పెట్టడం విషయంలో హోం భలే వెనకడుగు వేయలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాంతార ప్రీక్వెల్ కోసం అభిమానులు సైతం చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరి ఏ మేరకు రిషబ్ శెట్టి తన నటనతో మరొకసారి ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి మరి. ఏది ఏమైనా రిషబ్ శెట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఆస్కార్ దిశగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తున్నారు మరి రిషబ్ శెట్టి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది ఒకవేళ వర్కౌట్ అయితే ఆస్కార్ వరిస్తుందా? లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు