Kantara : తెలుగులోనూ రచ్చ రచ్చ

ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతారా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తొలుత ఈ సినిమా కేవలం కన్నడంలోనే విడుదలైంది. కన్నడలో మంచి కలెక్షన్లు రావడంతో ఈ సినిమాని హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో విడుదల చేశారు. కర్ణాటకలో ఇప్పటికే కేజీఎఫ్ రికార్డులను క్రాస్ చేసినట్టు సమాచారం.

అతి తక్కువ బడ్జెట్ తో రిషబ్ శెట్టి స్వయంగా నటిస్తూ తెరకెక్కించిన కాంతారా మూవీని హోంబలే ఫిల్మ్ నిర్మించింది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగులో కేవలం నాలుగు రోజుల్లోనే రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఐదో రోజు రూ.2.3 కోట్లతో ఐదు రోజుల్లో కలిసి మొత్తం 22.3 కోట్ల గ్రాస్ తో బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుంది.

ముఖ్యంగా రిషబ్ శెట్టి అద్భుత నటన, దీనికి తోడు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అన్ని బాగుండడం వల్లనే ఈ సినిమా సూపర్ రికార్డు సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి పెద్ద హిట్ అయిన చిత్రాల్లో కాంతారా నెంబర్ వన్ స్థానంలో ఉంటుందనే చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంతారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏ ఇండస్ట్రీలో చూసినా నిర్మాతలందరికీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా కాంతారా నిలిచింది. మున్ముందు ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు