Karan Johar: నెటిజన్ కామెంట్ పై కౌంటర్ చేసిన బడా నిర్మాత

Karan Johar: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దర్శకుడు ఆయన కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాఫీ విత్ కరణ్ అనే షో తర్వాత కరణ్ గురించి చాలామందికి ఇంకా బాగా తెలిసింది.కరణ్ జోహార్ బయట మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటారు కొన్నిసార్లు నెటిజన్స్ కి స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ ఉంటారు.

కరణ్‌ జోహార్‌ 2017లో సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు (యశ్‌, రూహీ) తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆ పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కరణ్ జోహార్ ఇంస్టాగ్రామ్ వేదిక షేర్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగానే రూహీ ఫొటోను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేశారు. కరణ్ షేర్ చేసిన ఆ ఫోటోకు ‘రూహీ వర్సెస్‌ సిరి’ అని క్యాప్షన్‌ పెట్టారు. కాగా ఈ ఫోటోపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘సార్, ఇంతకీ రూహీ తల్లి ఎవరు ?, దయచేసి ఎవరైనా ఉంటే చెప్పండి. ఈ విషయంలో నేను గందరగోళానికి గురి అవుతున్నాను’ అంటూ ఆ నెటిజన్ కామెంట్‌ పెట్టాడు.

Karan Johar

- Advertisement -

మామూలుగా అయితే కొంతమంది సెలబ్రిటీస్ ని కొందరు టార్గెట్ చేస్తూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీస్ వాళ్లను పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ముఖ్యంగా తెలుగు సెలబ్రిటీస్ అయితే ప్రతి విషయానికి పెద్దగా స్పందించరు ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. కరణ్ జోహార్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ ‘ఆమెకు తండ్రి మాత్రమే కాదు, తల్లిని కూడా నేనే. మీ అయోమయ స్థితి గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అందుకే, మీ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది’’ అని కరణ్‌ జోహార్‌ కౌంటర్ వేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు