Karate Kalyani: అంతా భార్య వల్లే… సూర్య కిరణ్ మరణం పై నిజాలు చెప్పిన కరాటే కళ్యాణి..!

ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ నిన్న (సోమవారం) అకాల మరణం చెందడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈయన డైరెక్టర్ గానే కాకుండా ప్రముఖ సీనియర్ హీరోయిన్ కళ్యాణి భర్తగా కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే గతంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక సూర్య కిరణ్ చిన్న వయసులో అనారోగ్యంతో చనిపోవడం ఏమిటనే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి. కాగా సూర్యకిరణ్ మరణం వెనుక ఉన్న అసలు నిజాలు బయటపెట్టారు ప్రముఖ నటి కరాటే కళ్యాణి.

సూర్య కిరణ్ కెరియర్…
బాల నటుడిగా కెరియర్ మొదలుపెట్టిన సూర్య కిరణ్ దాదాపు 200 చిత్రాలలో నటించారు. 1990 వరకు నటుడిగా కొనసాగిన ఈయన 2003లో వచ్చిన సత్యం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇందులో సుమంత్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకోవడమే కాదు, సూర్య కిరణ్ కి దర్శకుడిగా మొదటి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో ధన 51 , రాజు భాయ్, బ్రహ్మాస్త్రం సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇవేవీ కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేదు. దాంతో సినీ పరిశ్రమకు దూరమైన సూర్య కిరణ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా మార్చి 11న చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు అన్న వార్త అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది..

సూర్య కిరణ్ మరణం వెనుక అసలు నిజం…
ఇకపోతే సూర్య కిరణ్ జాండీస్ బారిన పడి కన్నుమూశారు అంటూ వార్తలు రాగా… అసలు విషయాన్ని వెల్లడించారు కరాటే కళ్యాణి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సూర్య కిరణ్ ఇంత త్వరగా మరణించడానికి కారణం భార్యా కళ్యాణి తో విడిపోవడం అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. “సూర్య కిరణ్ ఒక మంచి నటుడు.. సింగర్.. డాన్సర్.. దర్శకుడు కూడా.. పైగా బాల నటుడిగా 200 చిత్రాలకు పైగా చేశాడు. నంది అవార్డులు అందుకున్నారు. సినిమా కెరియర్ లో ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్న ఆయన.. వ్యక్తిగత జీవితమే ఇంత త్వరగా మరణించేలా చేసింది” అంటూ ఆమె తెలిపింది.. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత సూర్య కిరణ్ వేదనకు గురయ్యారు. ఆమెను గుండెలనిండా నింపుకున్నారు. ఆమె దూరం కావడంతో తట్టుకోలేకపోయారు. ఇంకా ఈ లోకంలో నాకంటూ ఏమీ లేదని తాగుడుకు బానిస అయి రాత్రంతా మందు, సిగరెట్స్ తాగుతూ గడిపేవారు. ఇక ఆ తాగుడు వల్లే జాండీస్ వచ్చింది. అందుకే ఆయన మరణించారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది..

- Advertisement -

సూర్య కిరణ్ – కళ్యాణి ప్రేమ బంధం..
ప్రముఖ హీరోయిన్ కళ్యాణి అలియాస్ కావేరిని సూర్యకిరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ సినిమాలలో బిజీగా ఉన్నప్పుడే నిర్మాణ సంస్థను స్థాపించి.. ఆ నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు చేశారు. అయితే అవేవీ కూడా సక్సెస్ కాలేదు. దీంతో నష్టాల బాట పట్టారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడాకులు తీసుకున్నారు. ఇక వీరిద్దరు విడిపోయిన తర్వాత కళ్యాణి వదిలి వెళ్ళినా… తాను మాత్రం కావాలి అనుకుంటున్నట్లు బిగ్ బాస్ హౌస్ లో సూర్యకిరణ్ చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో సూర్యకిరణ్, కరాటే కళ్యాణి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ విషయాలను సూర్యకిరణ్, కరాటే కళ్యాణి తో వెల్లడించినట్లు ఆమె తాజాగా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం కరాటే కళ్యాణి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు