Kareena Kapoor:ఒకే ఇంట్లో ఉన్నా చూడడానికి కూడా ఉండదు.. కరీనా ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

Kareena Kapoor.. బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు.. తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అలరిస్తున్న కరీనాకపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా మారిన కరీనాకపూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తన భర్తతో సమయం గడపడానికి కూడా తనకు సమయం లేదు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

Kareena Kapoor: Even in the same house, we can't even see each other.. Kareena's emotional comments are viral..!
Kareena Kapoor: Even in the same house, we can’t even see each other.. Kareena’s emotional comments are viral..!

ఓకే ఇంట్లో ఉన్నా చూసుకునే భాగ్యం లేదు..

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనాకపూర్ మాట్లాడుతూ.. నా భర్త సైఫ్ అలీ ఖాన్ తో మాట్లాడడానికి కూడా నాకు సమయం లేకుండా పోతోంది. పెళ్లి తర్వాత ఎంతో మారాము.ఒకరికొకరు తోడుగా ఉండడం నేర్చుకున్నాము. షూటింగ్స్ కారణంగా కలిసి సమయాన్ని స్పెండ్ చేయడానికి వీలు ఉండడం లేదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా కొన్నిసార్లు ఒకరినొకరు చూసుకోవడానికి కూడా మాకు సమయం ఉండదు. ఇక వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను బ్యాలెన్స్ చేయడం అంత సులభమైన పనేమీ కాదు. అందుకే వీలు దొరికిన ప్రతిసారి కూడా సమయం గడపాలి అని కోరుకుంటాము.. సాధ్యమైనంత వరకు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తాము అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది కరీనాకపూర్. మొత్తానికైతే తన భర్తతో కూడా సమయం గడపడానికి కుదరడం లేదు అంటూ తెలిపి, అందరిని ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా అటు వృత్తి పరమైన ఇటు వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేయడం నిజంగా అంత సులభమైన పని కాదు అని చెప్పవచ్చు. అందుకే ఇలాంటి జీవితాలను బ్యాలెన్స్ చేయలేక చాలామంది విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

అత్యధిక పారితోషకం పై స్పందించిన కరీనా..

ఇకపోతే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన ఈమె.. పారితోషకంపై కూడా స్పందించింది. డబ్బు కంటే పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. దాదాపు రూ .10 నుంచి రూ.15 కోట్ల వరకు సంపాదిస్తున్న తారలలో నేను కూడా ఒకదానిని.. కేవలం పారితోషకాన్ని దృష్టిలో ఉంచుకొని నేను సినిమాలను అంగీకరించడం లేదు.. ముఖ్యంగా ఈ స్థాయికి రావడానికి.. దాని వెనుక పడ్డ కష్టం ఎంతో.. పాత్ర నచ్చితేనే తక్కువ రెమ్యునరేషన్ కైనా సరే నటిస్తాను.. అది పూర్తిగా నా అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుంది.. సినిమా ఎలాంటిది.. అందులో నా పాత్ర ఏమిటి.. అది సమాజం పై ఎలా ప్రభావం చూపుతుంది… అనే విషయాలను అన్నింటిని నేను పరిగణలోకి తీసుకుంటాను.. ఆ తర్వాతనే సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటాను అంటూ తెలిపింది కరీనాకపూర్. మొత్తానికైతే పారితోషకం విషయంలో కూడా క్లారిటీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే అత్యధిక పారితోషకం తీసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పలు యాడ్స్ లో కూడా నటిస్తూ భారీగానే సంపాదిస్తుందని చెప్పవచ్చు.. ఏది ఏమైనా తీసుకునే పారితోషకానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నానని స్పష్టం చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు