Devara : దేవరకి పోటీగా మూడు సినిమాలు.. అక్కడ కష్టమే..!

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా ఇండియా వైడ్ గా మంచి అంచనాలున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమ్మర్ లో రావాల్సిన సినిమా ఏకంగా సెప్టెంబర్ 27కి వాయిదా పడగా, రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అభిమానుల్లో క్యూరియాసిటి పెరిగిపోతుంది. ఇక నిర్మాత కళ్యాణ్ రామ్ ఖర్చుకి వెనకాడకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, కొరటాల శివ కూడా ఎంతో వైవిధ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్ మెప్పించాయి. ఇదిలా ఉండగా దేవర కి పోటీగా సెప్టెంబర్ లో పెద్దగా సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ ఇవ్వడం లేదు. దీనికి రెండు వారాల ముందు గాని, తర్వాత గాని వస్తున్నాయి. అయితే కోలీవుడ్ లో మాత్రం అదేరోజున ఏకంగా మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

Karthi and Jayam ravi films are coming to compete with NTRs' Devara

కోలీవుడ్ లో సెప్టెంబర్ 27న మూడు సినిమాలు..

కోలీవుడ్ లో సెప్టెంబర్ 27న ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మొదట కార్తీ నటిస్తున్న ‘మైయాఘగన్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అరవింద్ స్వామి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రేమ్ కుమార్ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాను స్వయంగా సూర్య – జ్యోతికలు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు జయం రవి నటిస్తున్న ‘బ్రదర్’ అనే సినిమాను కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను రాజేష్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటు యంగ్ హీరో కెవిన్ హీరోగా నటిస్తున్న ‘బ్లడీ బెగ్గర్’ సినిమాని కూడా అదే రోజున రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

- Advertisement -

కోలీవుడ్ లో దేవర హావ కష్టమేనా?

ఇక దేవర (Devara) కి తెలుగులో పెద్దగా పోటీ లేకపోయినా ఆ రోజున తమిళ్ లో మాత్రం భారీగా పోటీ ఉండనుందని తెలుస్తుంది. అయితే మిగతా రేడు సినిమాల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా కార్తీ సినిమా నుండి మాత్రం గట్టి పోటీ నెలకొని ఉంది. దీన్ని బట్టి కోలీవుడ్ లో దేవర హవా కష్టమని వార్తలు వస్తున్నాయి. పైగా కార్తీ సినిమా కాబట్టి రిలీజ్ టైం నాటికి తెలుగులో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే కంటెంట్ బాగుంటే రెండు సినిమాలని జనాలు ఆదరించే అవకాశం లేకపోలేదు. కానీ ఓపెనింగ్స్ లో అయితే దెబ్బ పడే ఛాన్స్ ఉంది. మరి రిలీజ్ డేట్ నాటికి ఏ సినిమా అయినా తప్పుకుంటుందా లేదా అన్ని వస్తాయా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు