Karthi: కంగువ సినిమాలో కార్తీ.? పొరపాటున నిజం చెప్పిన నిర్మాత

Karthi: దర్శకుడు శివ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ సిరూతై శివ అంటే చాలామంది సినిమా ప్రేమికులకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమాతోనే కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు శివ. శివ నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ సినిమాటోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించుకున్నాడు . ప్రముఖ సినిమాటోగ్రాఫర్ “జయన్ విన్సెంట్” దగ్గర కొంతకాలం పనిచేసాడు.

దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా జయం మనదేరా సినిమాకి ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసిన శివ, ఆ తర్వాత తను సినిమాటోగ్రాఫర్ గా మారి కొన్ని సినిమాలకు పనిచేసే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. తెలుగులో విఎన్ఆర్ ఇచ్చే దర్శకత్వం వహించిన మూడు సినిమాలకు శివ సినిమాటోగ్రఫీ చేశాడు.2008లో దర్శకుడుగా మారాడు శివ. గోపీచంద్, అనుష్క శెట్టి నటించిన శౌర్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు.

ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ శంఖం అనే సినిమాను తెరకెక్కించాడు.
2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ఎంట్రీ ఇచ్చాడు . తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమాలో కార్తీ మెయిన్ లీడ్ గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అక్కడితో ఆయన “సిరుతై శివ”గా మారిపోయారు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో దరువు అనే సినిమాను చేశాడు శివ. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

- Advertisement -

ఇకపోతే తెలుగులో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శివ తమిళ్లో బాగా పాపులర్ అని చెప్పొచ్చు. దీని కారణం అజిత్ లాంటి స్టార్ హీరోతో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను చేశాడు శివ. దాదాపు అజిత్ తో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించాయి. శివ చేసిన వీరం వేదాళం సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు. అయితే ఈ రీమేక్ సినిమాలు తెలుగులో ఊహించిన స్థాయిలో ఆడలేదు.

Kanguva (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

కంగువ సినిమాలో కార్తీ.?

ఇకపోతే ప్రస్తుతం శివ కంగువ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. సూర్య నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్ కూడా సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతుంది. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కార్తీ ఉన్నాడు అనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తూ వస్తున్నాయి. జ్ఞానవేల్ రాజా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి అడిగినప్పుడు ఈ సినిమా సెట్ కి అసలు వెళ్ళలేదు అని, కార్తీ అని టాపిక్ మొదలు పెట్టి అక్కడితో ఆపేసి చిన్న పని వలన ఒక్కసారి మాత్రమే సెట్ కి వెళ్ళాను అంటూ చెప్పాడు. అయితే ఇక్కడితో చాలామంది ఈ సినిమాలో కార్తీ తప్పకుండా ఉంటాడు కానీ ఆ సర్ప్రైజ్ ను చెప్పకుండా దాస్తున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు