Sardar2 : గ్రాండ్ గా మొదలైన కార్తీ సీక్వెల్ ప్రాజెక్ట్.. రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే?

Sardar2 : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రెండేళ్ల కింద పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కార్తీ లాస్ట్ ఇయర్ రెండో పార్ట్ తో కూడా ఆకట్టుకున్నాడు. ఇక మధ్యలో సర్దార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జపాన్ అనే ప్రయోగాత్మక సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా కార్తీ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం మెయియాజగన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే వా వాథియర్ అనే సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ జరుగుతుండగానే మరో క్రేజీ సినిమా ప్రారంభించాడు కార్తీ. అదే సర్దార్2. కార్తీ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం నేడు చెన్నైలో జరిగింది.

Karthi starrer Sardar2 movie opening ceremony

గ్రాండ్ గా స్టార్ట్ అయిన సర్దార్ సీక్వెల్..

ఇక రెండేళ్ల కింద వచ్చిన సర్దార్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. PS మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించి వంద కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక రెండో పార్ట్ గా సీక్వెల్ వస్తుందని అప్పట్లోనే అనౌన్స్ చేసారు. ఇక లేటెస్ట్ గా సర్దార్ సీక్వెల్ (Sardar2) సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి చిత్ర యూనిట్ మాత్రమే హాజరవడం జరిగింది. కార్తీ కెరీర్ లో ఖైదీ తర్వాత ఆ రేంజ్ హిట్ అయిన సినిమా సర్దార్ కావడంతో ఈ సీక్వెల్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సీక్వెల్‌ ను మరింత భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు మేకర్స్. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించనున్నారు.

- Advertisement -

షూటింగ్ కూడా వెంటనే..

ఇక కార్తీ సర్దార్ సీక్వెల్ ప్రారంభోత్సవ వేడుకని ఈరోజే ప్రారంభించగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జూలై 15న చెన్నైలోని ఓ స్టూడియో సెట్స్‌లో ప్రారంభం కానుందని సమాచారం. తొలి షెడ్యూల్ లోనే కార్తీ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈ సర్దార్2 నేపథ్యం విషయానికి వస్తే.. కంబోడియా మిషన్‌ తో సినిమా నడుస్తుందని టాక్. ఈ విషయం గతంలోనే సర్దార్ లో ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఇక ఈ సినిమాలో కార్తీ రా ఏజెంట్‌ గా కనిపించనున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అయితే సీక్వెల్ లో కూడా రాశి ఖన్నా ని హీరోయిన్ గా కొనసాగిస్తారా? లేక మరో హీరోయిన్ ని కూడా దించుతారా తెలియదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు